Gurthunda Seethakalam: ఎట్టకేలకు రిలీజ్ డేట్‌తో వచ్చిన గుర్తుందా శీతాకలం!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ముద్రను వేసుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గుర్తుందా శీతాకాలం మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కోసం ఈ సినిమాను ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Gurthunda Seethakalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ముద్రను వేసుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

అయితే ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వరుసగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఊసే లేకుండా పోవడంతో, అసలు ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా, తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌తో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

‘గుర్తుందా శీతాకాలం’ – కీలక పాత్రలో సీనియర్ నటి సుహాసిని..

గుర్తుందా శీతాకాలం మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కోసం ఈ సినిమాను ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ పోస్టర్‌తో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య శెట్టిలు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు