Gurugram Woman: ‘కుక్క దాడి చేసినందుకు బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలి’.. ‘ఫోరం’ ఆదేశం

ఓ పెంపుడు కుక్క తనపై దాడి చేసినందుకుగాను ఓ మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కేసు వేసింది. దీంతో బాధితురాలికి రూ.2 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని గురుగ్రాం మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ని ఫోరం ఆదేశించింది. ఒకవేళ ఆ పరిహారాన్ని ఆ కుక్క యజమాని నుంచే వసూలు చేయాలని భావిస్తే, అతడి నుంచే ఎంసీజీ ఆ డబ్బును వసూలు చేసి బాధితురాలికి ఇవ్వాలని సూచించింది.

Gurugram Woman: ‘కుక్క దాడి చేసినందుకు బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలి’.. ‘ఫోరం’ ఆదేశం

Gurugram Woman: ఓ పెంపుడు కుక్క తనపై దాడి చేసినందుకుగాను ఓ మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కేసు వేసింది. దీంతో బాధితురాలికి రూ.2 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని గురుగ్రాం మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ని ఫోరం ఆదేశించింది. ఒకవేళ ఆ పరిహారాన్ని ఆ కుక్క యజమాని నుంచే వసూలు చేయాలని భావిస్తే, అతడి నుంచే ఎంసీజీ ఆ డబ్బును వసూలు చేసి బాధితురాలికి ఇవ్వాలని సూచించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే హరియాణాలోని గురుగ్రాంలో నివసించే మున్నీ అనే మహిళ ఈ ఏడాది ఆగస్టు 11న తమ బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెపై వినిత్ చికారా అనే వ్యక్తికి చెందిన కుక్క దాడి చేసింది. దీంతో ఆమె తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె మొదట గురుగ్రామ్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. బాధితురాలిని అనంతరం అక్కడి వైద్యులు ఢిల్లీలోని సఫదర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు.

ఆ మహిళపై దాడి చేసిన కుక్క పిట్‌బుల్ జాతికి చెందిందని పోలీసులు ఐఎఫ్ఐలో నమోదు చేశారు. అయితే, ఆ కుక్క ‘డొగొ అర్జెంటీనో’ జాతికి చెందిందని దాని యజమాని అనంతరం పోలీసులకు తెలిపాడు. మరోవైపు, బాధిత మహిళ ఫోరంలో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కుక్కను కస్టడీలోకి తీసుకోవాలని ఎంసీజీని ఆదేశించింది. అలాగే, ఆ కుక్కను పెంచుకోవడానికి వినిత్ చికారా వద్ద ఉన్న లైసెన్సును రద్దు చేయాలని చెప్పింది.

అలాగే, 11 రకాల విదేశీ జాతుల కుక్కలపై నిషేధం విధించాలని సూచించింది. మూడు నెలల్లో పెంపుడు కుక్కలకు సంబంధించిన పాలసీని రూపొందించాలని చెప్పింది. వినిత్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ‘డొగొ అర్జెంటీనో’ జాతికి చెందిన కుక్కను పెంచుకున్నాడని స్పష్టం చేసింది. బాధిత మహిళ చాలా పేద వ్యక్తని, ఎంసీజీ ఆమెకు రూ.2 లక్షలు చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును వినిత్ నుంచి వసూలు చేసి ఇవ్వచ్చని తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..