హ్యూమన్ రిలేషన్‌షిప్ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘గువ్వ గోరింక’

  • Published By: sekhar ,Published On : December 7, 2020 / 05:07 PM IST
హ్యూమన్ రిలేషన్‌షిప్ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘గువ్వ గోరింక’

Guvva Gorinka: సత్య దేవ్, ప్రియా లాల్, ప్రియదర్శి ప్రధాన పాత్ర ధారులుగా, రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘సర్కార్’ నుండి ‘రక్తచరిత్ర’ వరకు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి దర్శకత్వంలో, జీవన్, దాము సంయుక్తంగా నిర్మించిన సినిమా.. ‘గువ్వ గోరింక’. ఈ నెల 17న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ బమ్మిడి మాట్లాడుతూ.. ‘‘నా వరకు హ్యూమన్ రిలేషన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆన్ ది ఎర్త్. సినిమా అంటేనే డ్రైవ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్… ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్… ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో తియ్యగలిగే, అందరికి టచ్ అయ్యే సబ్జెక్ట్ సినిమా.. ఈ ‘గువ్వ గోరింక’.

ఇప్పుడున్న లైఫ్‌‌స్టైల్ బేస్ చేసుకొని త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ గురించి చెప్పాలనుకున్నాను… ఫిజికల్‌గా దూరంగా వున్నా మనసులు మనస్తత్వాల్లో దగ్గరగా వున్న ఒక జంట మెయిన్ ప్లాట్‌గా… ఫిజికల్‌గా దగ్గరగా వున్నా వారి మధ్య చాలా దూరం వున్న మరో జంట, అసలు ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ సెక్స్ కోసమే అనుకున్న మరో కుర్రాడు సబ్‌ప్లాట్స్‌గా వుంటాయి.

Guvva Gorinka

ఈ మూడురకాల రిలేషన్‌షిప్స్ ప్రాధమికంగా ఒకే విషయాన్ని చెప్తాయి. అదేంటంటే ఇక్కడవున్న రిలేషన్‌షిప్‌కి కారణం ప్రేమ అనుకుంటే అసలు మనం అనుకునే ప్రేమ నిజమైన ప్రేమేనా? అసలు ప్రేమంటే ఒకర్ని మరొకరు ఇష్టపడడమా… ఇంప్రెస్ చేసుకోవడమా… ఫిజికల్‌గా కలవడమా… లేకపోతే ఒకర్నొకరు అర్ధం చేసుకుంటూ ఒకరి బలహీనతలకు మరొకరు బలమై లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడమా… ఎదైతే బెటర్ అని చెప్పడం కంటే కూడా ఆయా రిలేషన్‌షిప్‌లో వున్న కోణాల్ని చెప్పాలనుకున్నాను…

హ్యూమన్ రిలేషన్‌షిప్ మీద ఆసక్తి, అవగాహనికి కారణం మా అన్నయ్య బమ్మిడి జగదీశ్వరరావు కథలతో పాటు రావిశాస్త్రి, పతంజలి, బుచ్చిబాబు, గోపిచంద్, మహశ్వేతాదేవి, శరత్ చంద్ర కథలు ఇరానియన్ మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి.

నా గురువు గారు రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘సర్కార్’ నుండి ‘రక్తచరిత్ర’ వరకు నా ప్రయాణంలో చాలా విషయాలు, అందులో ముఖ్యంగా కథ దానిలో వున్న కోణాలే కాకుండా ఎటువంటి కథనయినా సినిమాగా ఎలా మలచొచ్చు, స్పాంటేనియస్ షూటింగ్ సెన్సుతో విత్ ఇన్ బడ్జెట్లో ఎలా తియ్యొచ్చో తెలుసుకున్నాను.

Guvva Gorinka

ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే సత్యదేవ్… వెరీ గుడ్ యాక్టర్. అయితే నేను తెలుసుకున్నదేంటంటే నేను అసోసియేట్‌గా పనిచేసిన యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, సూర్య, వివేక్ ఒబెరాయ్‌లా షూట్లో తనకంటు స్పాంటేనిటీ వుంటుంది…

అది ఆ క్యారెక్టర్‌కి రియలిస్టిక్ నేచర్‌ని తీసుకొస్తుంది. ఆ కోవకి చెందిన ఆర్టిస్ట్ సత్యదేవ్. ఇక ప్రియలాల్ విషయానికి వస్తే వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ టు వర్డ్స్ వర్క్. ముఖ్యంగా ఈ అమ్మాయిని కాస్ట్ చెయ్యడానికి కారణం గర్ల్ నెక్స్ట్ డోర్‌లా వుంటుంది. ఇది సినిమాకి చాలా అవసరం.

ప్రియదర్శి … వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఐ ఎవర్ సీన్. దర్శి స్పాంటేనియస్ ఆల్ వేస్ ఎమ్యూజింగ్ టు మి. చైతన్య మరియు మధుమిత ఇద్దరు లివ్ ఇన్‌లో వున్న జంటగా క్యారెక్టర్స్‌‌‌లో ఒదిగిపోయారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే నా బలమూ, ధైర్యమూ వాళ్ళే. వెరీ లిమిటెడ్ రిసోర్సులో కూడా మేమనుకున్నది అచీవ్ చెయ్యగలిగానంటే ఆ క్రెడిట్ టెక్నిషియన్సుదే… ముఖ్యంగా డీవోపి మైలెసన్ రంగస్వామి నేననుకున్న విజువల్స్‌‌ 100 పెర్సెంట్ ఇవ్వగలగడమే కాకుండా దానికోసం రిలేటెడ్ డిపార్టుమెంట్స్‌తో కోఆర్డినేట్ చేస్తూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.

నేను ముంబాయిలో అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు డీవోపీ మైలెసన్, ఎడిటర్ ప్రణవ్ మిస్త్రితో కలిసి పనిచేసే వాళ్ళం. అందువల్ల మా మధ్య బెస్ట్ కమ్యునికేషన్ వుంది… మూవీ ఎడిట్ టేబుల్ మీదే తయారవుతుందని ప్రణవ్ మరోసారి ప్రూవ్ చేసాడు.

మ్యూజిక్ విషయానికొస్తే సురేష్ బొబ్బిలి మా వేవ్ లెంగ్త్‌తో కలవడానికి ఇబ్బంది పడినా తరువాత మాత్రం ఆయన మ్యూజిక్ విజువల్‌ని ఎన్‌హేన్స్ చేస్తూ వచ్చింది. మా ఆర్ట్ డైరెక్టర్ సాంబశివరావు నేను అడిగిన దాని కంటే బ్యూటీతో పాటు క్యారక్టరైజేషన్ మిస్ అవకుండా తన ఆర్ట్ వర్క్‌‌తో మూవీకి ఒక బ్యూటీని ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే జీవన్ ఈ సినిమా మొదలవడానికి కారణమైతే, దాము ఈ సినిమా మీముందుండడానికి కారణం’’.. అన్నారు