Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్‌లో మాల్వేర్‌ పంపుతున్న హ్యాకర్లు..!

జూమ్ యాప్ వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..

Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్‌లో మాల్వేర్‌ పంపుతున్న హ్యాకర్లు..!

Hackers Using Zoom To Install Malware On Your Computer And Phone

Zoom Hackers : ప్రస్తుతం వర్చువల్ మీటింగ్స్ ఎక్కువయ్యాయి. ఫేస్ టు ఫేస్ కాకుండా అన్ని దాదాపు ఆన్ లైన్ మీటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి వర్చువల్ మీటింగ్స్ డిమాండ్ పెరిగిపోయింది. అప్పటినుంచి డైరెక్టుగా కన్నా ఇలా వర్చువల్ మీటింగ్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏ ఆన్ లైన్ క్లాసులు వినాలన్నా.. స్కూల్, కాలేజీ, ఆఫీసు మీటింగ్స్ ఇలా ప్రతి ఒక్కటి వర్చువల్ వేదికగా జరుగుతున్నాయి. వర్చువల్ మీటింగ్స్ కోసం ఎక్కువగా పాపులర్ జూమ్ యాప్ వినియోగిస్తున్నారు. ఇదే హ్యాకర్లు క్యాష్ చేసుకుంటున్నారు.

అందుకే.. జూమ్ యాప్ వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. మీ కంప్యూటర్, ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు ఈ Zoom App వినియోగిస్తారని ఓ నివేదిక వెల్లడించింది. జూమ్ యాప్‌లోని బగ్ కారణంగా హ్యాకర్లు సులభంగా మీ కంప్యూటర్లు లేదా ఫోన్లలోకి మాల్ వేర్ ఇన్‌స్టాల్ చేసేందుకు వీలుంది. ఈ జూమ్ యాప్‌లోని సెక్యూరిటీ భద్రతా లోపమే కారణం.. నివేదికల ప్రకారం.. హ్యాకర్లు ముందుగా టార్గెట్ చేసిన డివైజ్‌లోకి ఒక సాధారణ మెసేజ్ పంపుతారు. ఆపై డివైజ్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది.

Hackers Using Zoom To Install Malware On Your Computer And Phone (1)

Hackers Using Zoom To Install Malware On Your Computer And Phone 

ఇప్పుడు.. జూమ్ తమ యాప్‌‌లో బగ్‌ ఉందని గుర్తించింది. జూమ్ క్లయింట్ వెర్షన్ 5.10.0కి ముందు వెర్షన్ Android, iOS, Linux, macOS, Windows సిస్టమ్‌లలో రన్ అవుతుంది. ఈ వెర్షన్ 5.10.0కి ముందు మీటింగ్స్ కోసం జూమ్ క్లయింట్ (Android, iOS, Linux, macOS, Windows) సర్వర్ స్విచ్ రిక్వెస్ట్ సమయంలో హోస్ట్ పేరును సరిగ్గా ధృవీకరించడం లేదు. జూమ్ సర్వీసులను వాడేందుకు ప్రయత్నిస్తే.. మాల్‌వేర్ సర్వర్‌కు కనెక్ట్ అయ్యేలా చేస్తుందని జూమ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ బగ్‌ను గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటర్ ఇవాన్ ఫ్రాట్రిక్ కనుగొన్నారు. ఫిబ్రవరిలో జూమ్‌కు ఈ బగ్ ఉందని నివేదించాడు.

XMPP ప్రోటోకాల్ ద్వారా Zoom Chat ద్వారా బాధితునికి మెసేజ్‌లను హ్యాకర్లు పంపుతారని ఫ్రాట్రిక్ తెలిపారు. అమాయక యూజర్లను లక్ష్యంగా చేసుకుని వారి డివైజ్‌లోకి హానికరమైన కోడ్‌లను ఇన్ స్టాల్ చేస్తారు. అందుకు హ్యాకర్లు మెసేజ్ రూపంలో రూపొందించిన కోడ్‌ను పంపుతారు. ఈ కోడ్ మెసేజ్ యూజర్లకు పంపినప్పుడు ఎలాంటి వార్నింగ్ మెసేజ్ రాదు. దాంతో యూజర్ కు తెలియకుండానే కంప్యూటర్ లేదా ఫోన్‌కు మాల్ వేర్ ఇంజెక్ట్ అవుతుంది. ఈ మాల్‌వేర్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్‌తో సహా డివైజ్‌లను సులభంగా హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు. ఈ సమస్య నుంచి జూమ్ యూజర్లు ఎలా భయపడాలంటే.. ప్రతి జూమ్ యూజర్ తప్పనిసరిగా తమ జూమ్ యాప్ V5.10.0 వెంటనే అప్ డేట్ చేసుకోవడం మంచిది. ఏదైనా హానికరమైన లింక్‌లను ఓపెన్ చేయడం లేదా టెక్స్ట్ మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వకపోవడమే చాలా మంచిదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు

Read Also : Zoom call: సీఈఓ ఆన్ ఫైర్.. జూమ్ కాల్ మాట్లాడుతూనే 900 మంది ఉద్యోగాలు తీసేశాడు!