Hair Loss : జుట్టు రాలిపోతుందా? జాగ్రత్తలు పాటించడం మంచిది

రాత్రి నిద్ర సమయంలో దిండు వాడుకోవటం అందరికి అలవాటు. అయితే దిండుపై పడుకోవటం వల్ల జుట్టు రాపిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి.

Hair Loss : జుట్టు రాలిపోతుందా? జాగ్రత్తలు పాటించడం మంచిది

Hair (1)

Hair Loss : జుట్టు రాలిపోవడం అన్నదిప వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలో కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ పరిస్ధితులు, పోషకాహార లోపం, కాలుష్యం, ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. మగవాళ్లు, ఆడవాళ్లు ఎక్కువగా జుట్టు విషయంలో చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు మార్కెట్లో లభించే వివిధ రకాల అయిల్స్, షాంపులను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే వాటిల్లో ఏవి జుట్టుకు మేలు చేస్తాయో, లేక మరింత హాని చేస్తాయో ఏమాత్రం అంచనా వేయలేరు. అయితే జుట్టుకు సరైన రక్షణ పద్దతులు, జాగ్రత్తలు పాటించటం ద్వారా మాత్రమే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

చాలా మందిలో జుట్టు రాలే సమస్య దీర్ఘకాలిక అనారోగ్యం , ఎదైనా పెద్ద శస్త్రచికిత్స జరిగిన సందర్భంలో, తీవ్రమైన ఇన్ఫెక్షన్ , ఒత్తిడి, ధూమపానం, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం కారణం వల్ల జుట్టు రాలిపోతుంది. ఆండ్రోజెన్ హార్మోన్ లేకపోవడం వల్ల సైతం జుట్టు రాలడం జరుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ఇవి కాకుండా మరికొన్ని కారణాల వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. జుట్టు జడ వేసుకునే విషయంలో చాలా బిగుతుగా వేసుకునే విధానం ఏమాత్రం సరైంది కాదు. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ రాపిడికి గురై నిర్జీవంగా మారిపోతుంది. పోనీటెల్ లాంటివి వేసుకున్నా కాస్త వదులుగా ఉండేలా వేసుకోవాలి. జుట్టుకు బిగుతుతనం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

రాత్రి నిద్ర సమయంలో దిండు వాడుకోవటం అందరికి అలవాటు. అయితే దిండుపై పడుకోవటం వల్ల జుట్టు రాపిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. అయితే పడుకునే ముందుగానే దిండును సిల్క్ కవర్ తో కప్పటం మంచిది. దీని వల్ల వెంట్రుకలకు రాపిడి తగ్గుతుంది. మార్కెట్లో జుట్టు కోసం ఉపయోగించే కండీషనర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే అవి పడకపోతే వాటి ప్రభావంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా జట్టు దెబ్బతింటుంది. జట్టుకు ఏషాంపూలు సరిపడతాయో వాటినే వినియోగించటం మంచిది. లేదంటూ సహజ సిద్ధంగా లభించే షీకాయ, కుంకుడు కాయలను వాడుకోవటం మంచిది.

జుట్టుకు నష్టాన్ని కలిగించే అయిల్స్ విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కదా అని వచ్చిన అయిల్ ఉత్పత్తులను వాడుకోవటం వల్ల జుట్టుకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. జుట్టు పోషణకు ఆముదం, కొబ్బరి నూనె వంటి వాటిని వాడుకోవటం మంచిది. రకరకాల ఆకృత్తుల్లో హెయిర్ స్టైల్స్ ఎదుటి వారికి చూసేందుకు బాగే ఉన్నా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అతిగా ఆలోచించటం, ఒత్తిడితో కూడిన జీవితం వల్ల సైతం జట్టు రాలిపోతుంది. ప్రతిచిన్న విషయాన్ని లోతుగా ఆలోచించటం వంటివి మానుకోవటం మంచిది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల జుట్టు కుదుళ్లు పఠిష్టంగా మారతాయి. రోజు వారి వ్యాయమాలు చేయటం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.