నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్, 14 అడుగులున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. బాబోయ్ పాము అంటూ

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 06:19 AM IST
నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్, 14 అడుగులున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. బాబోయ్ పాము అంటూ

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. బాబోయ్ పాము అంటూ కేకలు వేస్తూ ప్రాణ భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది సుమారు 14 అడుగులున్న, అది కూడా అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దగ్గరకెళ్లి, దానికి స్నానం చేయించాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసి అంతా షాక్ అవుతున్నారు. 

కింగ్ కోబ్రాకు సాన్నం:
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కింగ్ కోబ్రా ఓ ఇంటి ఆవరణలోని ట్యాప్ దగ్గరికి వచ్చింది. అదే సమయంలో ఓ వ్యక్తి దాని దగ్గరికి వచ్చాడు. అతడే ఏ మాత్రం భయపడలేదు. కుళాయి నీటిని బకెట్‌లో పట్టాడు. దాంతో కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు. దాని నెత్తి మీద రెండు బకెట్ల నీరు పోశాడు. కోబ్రా సైతం ఆ స్నానాన్ని ఆస్వాదిస్తూ సేద తీరడం గమనార్హం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి కోబ్రా తలపై నిమురుతూ కనిపించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మీరెవరూ దయచేసి ఇటువంటివి అనుకరించొద్దు:
ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌నందా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దాంతో పాటో ఆయన ఓ రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ వ్యక్తి సర్పాలను నియంత్రించడంలో అనుభవం ఉన్నవాడని చెప్పారు. కానీ మీరెవరూ దయచేసి ఇటువంటివి అనుకరించవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమని అని హెచ్చరించారు. 

కింగ్ కోబ్రా విషపూరితం, ఒక్క కాటుతో 20మందిని చంపొచ్చు:
వేసవి తాపానికి మనుషులే కాదు మూగజీవాలు కూడా విలవిలలాడిపోతున్నాయి. దాహానికి తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో చల్లదనం కోసం పాకులాడుతున్నాయి. ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాయి. వేసవి తాపానికి విలవిలలాడిన ఈ కింగ్ కోబ్రా కూడా అలానే ఇంటి ఆవరణలో ఉన్న ట్యాప్ దగ్గరికి చేరింది. స్నానం చేయడంతో పాటు తన దాహం తీర్చుకుంది. కళ్ల ముందు అంత పెద్ద పాము ఉన్నా ఏ మాత్రం భయపడకుండా కింగ్ కోబ్రాకు స్నానం చేయించిన వ్యక్తి గుండె ధైర్యానికి, గట్స్ కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, ఈ భూమ్మీద ఉన్న సర్ప జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన, పొడవైన, విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. ఈ పాము మనిషి నిల్చున్నట్టు నిటారుగా నిలబడగలదు. మనిషి కళ్లలోకి చూడగలదు. కింగ్ కోబ్రా ఒకసారి కాటు వేస్తే వచ్చే విషం ద్వారా 20మంది మనుషులను చంపేంత పవర్ ఉంటుంది.

Read: సల్మాన్ ఖాన్.. పర్సనల్ కేర్ బ్రాండ్ ఇదే.. శానిటైజర్లతోనే బిగిన్!