Hair Health : ఉల్లిపాయతో జుట్టు ఒత్తుగా, కుదుళ్లు బలంగా!

చాలామంది జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మార్చేందుకు ఉల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి.

Hair Health : ఉల్లిపాయతో జుట్టు ఒత్తుగా, కుదుళ్లు బలంగా!

Onion Hair Is Thick

Hair Health : ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బ్యాక్టీరియా, ఫంగస్‌లను తరిమికొట్టే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుకు ఉల్లిపాయ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు ఊడిపోయేవారికి ఉల్లిపాయలు దివ్యౌషధం. జుట్టు కుదుళ్లను ఒత్తుగా, బలంగా చేస్తాయి. చుండ్రుకు పోగొడతాయి.. ఉల్లిలో ఉండే సల్ఫర్, జుట్టు చిట్లిపోవడాన్నీ, సన్నగా అయిపోవడాన్నీ అడ్డుకుంటుంది. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం ప్రభావం కారణంగా చాలా మందిలో చుండ్రు సమస్యలు, తెల్ల జుట్టు రావడం లాంటి మొదలగు సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. ఈ నేపధ్యంలో జుట్టు సమస్యలను పోగొట్టుకునేందుకు వివిధ రకాల పద్దుతులను అనుసరిస్తుంటారు.

చాలామంది జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మార్చేందుకు ఉల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి. జుట్టులో కెరోటిన్ లోపం ఉండడం వల్ల చుండ్రు, జుట్టురాలటం వంటి సమస్యలు వస్తాయి. వీటిని పోగొట్టుకోవాలంటే ఉల్లిపాయ ఒక చిన్నా రెమిడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉల్లిపాయతో మిశ్రమం తయారీ విధానం ;

ఇందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో నాలుగు రెబ్బల కరివేపాకులను వేయాలి. ఈ కరివేపాకు జుట్టు కుదురులను బలంగా ఉంచి, జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. తర్వాత ఇందులోకి కలోంజి బ్లాక్ సీడ్స్ ఆయిల్ ను ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది జుట్టు త్వరగా పెరగేలా చేస్తుంది. తరువాత టి ట్రీ ఆయిల్ ను మూడు లేదా నాలుగు చుక్కలు వేయాలి. ఇది తలలో వచ్చే దురద వంటి సమస్యలను తొలగిస్తుంది. తర్వాత అందులోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జును వేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ జుట్టు పెరగడానికి చుండ్రు నుంచి విముక్తి పొందడానికి బాగా సహాయపడుతుంది. ఇలా వేసుకున్న మొత్తాన్ని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత జుట్టుకు ఆయిల్ రాయకుండా ఈ పేస్టును అప్లై చేయాలి. అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు ఒత్తుగా , బలంగా మారుతుంది.