తేజస్ యుద్ధ విమానం క్వాలిటీ తగ్గకూడదని ప్లాంట్ పెట్టేసిన ఇండియా

తేజస్ యుద్ధ విమానం క్వాలిటీ తగ్గకూడదని ప్లాంట్ పెట్టేసిన ఇండియా

Tejas fighter jets: నాణ్యతలు, సామర్థ్యం మాత్రమే కాదు.. తేజస్ అనేది దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పబోతున్న విషయం! యుద్ధ విమానం అంటే విదేశాల వైపు చూడాల్సిన సమయం మార్చాలనే ఉద్దేశ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోయింది ఇండియా. మన ఆవిష్కరణ చూసి పక్కదేశాలు క్యూ కడుతున్నాయ్.

సరిహద్దును కాపాడడంలో వాయుసేనదే కీలకపాత్ర! యుద్ధ విమానాలు మూడు రకాలుగా ఉంటాయ్.
ఇంటర్ సెక్టార్స్
బాంబర్స్
మల్టీ రోల్ ఫైటర్ జెట్స్
బాంబులేసేది బాంబర్స్ అయితే.. సపోర్టుగా నిలిచేది ఇంటర్ సెక్టార్స్… ఈ రెండు పనులు చేసేవి మల్టీ రోల్ ఫైటర్ జెట్లు. ఇండియాలాంటి విశాల సరిహద్దు ఉన్న దేశానికి యుద్ధ విమానాలు భారీ సంఖ్యలో అవసరం అవుతుంటాయ్.

ఇన్నాళ్లు ఈ విమానాల కోసం వేలకు వేల కోట్లు విదేశాలకు సమర్పించుకోవాల్సి వచ్చేది. ఆత్మనిర్భర్‌లో భాగంగా 83 తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల తయారీకి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మరికొద్దిరోజుల్లో యుద్ధ విమానాలకు సైన్యంలో చేరేందుకు సిద్ధం అవుతున్నాయ్.

బెంగళూరులో ప్రారంభమైన ఏరో ఇండియా 2021 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆ తర్వాత హెచ్ఏఎల్‌తో కలిసి 83 తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి వాయుసేన అధికారుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా చేపడుతోన్న భారీ కార్యక్రమం ఇది.. తేజస్ కొనుగోలుకు ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాయని రాజ్‌నాథ్ అన్నారు. బోర్డర్‌లో ఓవరాక్షన్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని… సరైన రీతిలో సమాధానం చెప్తామని చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు రాజ్‌నాథ్ సింగ్!

సరిహద్దుల్లో పరిస్థితి, ఉద్రిక్తల సంగతి ఎలా ఉన్నా.. తేజస్ రాకతో భారత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయం. తేజస్ యుద్ధ విమానాల్లో సగానికి పైగా దేశీయ పరికరాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో నిర్వహణ సులువుగా మారనుంది. ఇక యుద్ధ విమానాల కోసం భారీగా ఖర్చు చేయక తప్పదు! దీంతో విదేశీ మారకం భారీగా జరిగేది.

యుద్ధ విమానాలు ఎంత సేపు ఎగిరితే.. అంతేసేపు సర్వీసింగ్ చేయాల్సి ఉంటుంది. 24 గంటలు, 50గంటలకు పైగా సర్వీసింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయ్. భారీ ఎత్తులో ఎగురుతాయ్ కాబట్టి.. విడిభాగాలు చెడిపోతూ ఉంటాయ్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విమానాల పరికరాలు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. గతంలో విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకోవాలంటే బోలెడు రూల్స్ పాటించాల్సి వచ్చేది. కీలక యుద్ధ సమయాల్లో విదేశాలు విడిభాగాలు సరఫరాలను నిలిపేసిన సంఘటనలను వాయుసేన ఎదుర్కొంది.

ఇప్పుడు ఈ బాధ కొంత తీరే అవకాశాలు ఉంటాయ్. ఐతే తేజస్ విషయంలో అలా కాదు. ఇక్కడే తయారవుతుంది కాబట్టి.. అలాంటి సమస్యలు ఉండవని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ యుద్ద విమానాలైతే.. అన్ని దేశాల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అదే స్టాండర్డ్స్‌తో తయారు చేస్తాయ్. ఐతే ఇండియాకు వైవిధ్యమైన భౌగోళిక సరిహద్దు ఉంటుంది. పాకిస్తాన్‌తో ఒకలా.. చైనాతో మరోలా ఉంటుంది బోర్డర్ !

మనమే తయారు చేసుకుంటే… ఈ రెండు పరిస్థితులకు తగినట్లు వందకు వందశాతం లక్ష్యాలను పూర్తి చేసేలా జెట్లను రూపొందించుకోవచ్చు. ఇప్పుడు తేజస్ విషయంలో అదే జరుగుతోంది. ఇక తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి.. HAL, DRDO, ADA.. ఏళ్లుగా కృషి చేస్తున్నాయ్. ఇన్నాళ్లకు సొంత యుద్ధ విమానాలు తయారు చేసుకోవాలనే ఇండియా కల నెరవేరుతోంది.