కరోనాతో జాగ్రత్త : లాక్‌డౌన్‌లో యథేచ్చగా ‘హలీమ్’ హోం డెలివరీ!

  • Published By: srihari ,Published On : May 18, 2020 / 05:19 AM IST
కరోనాతో జాగ్రత్త : లాక్‌డౌన్‌లో యథేచ్చగా ‘హలీమ్’ హోం డెలివరీ!

హలీమ్.. అంటే హైదరబాదీలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రుచికరమైన హాలీమ్ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. మహానగరమైన హైదరాబాద్‌లో హాలీమ్‌కు ఫుల్ మార్కెట్ ఉంటుంది. లాక్ డౌన్ అయినప్పటికీ అండర్ గ్రౌండ్ మార్కెట్లో హాలీమ్ సేల్స్ జోరుందుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో నిబంధనల ప్రకారం.. ఎలాంటి సేల్స్, కుకింగ్ ఫుడ్ డెలివరీని నిషేధించింది. అయినాసరే అక్రమంగా హాలీమ్ డిష్‌ విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది అమ్మకందారులు ఫోన్ల ద్వారానే ఆర్డర్లు చేస్తున్నారు.

కొంతమంది మాత్రం కస్టమర్లకు నేరుగా హాలీమ్ ఆర్డర్లు అందిస్తున్నారు. మరికొంతమంది కాస్తా అదనంగా జోడించి ఇంటికే హోం డెలివరీ చేస్తున్నారు. ఒక్కో హాలీమ్ ఖరీదు దాదాపు రూ.300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ అయితే మాత్రం రూ.1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. బంజారా హిల్స్ నుంచి ఓ కుటుంబం.. మే 15నుంచి హాలీమ్ విక్రయిస్తోంది. అప్పటినుంచి తమకు భారీ మొత్తంలో కస్టమర్ల నుంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. 

వ్యాపారం మొదలైనప్పటి నుంచి రోజుకు 30 వరకు ఆర్డర్లు వస్తున్నట్టు తెలిపారు. ఖలిందా ( పేరు మార్చాం) అనే వ్యక్తి ఈ హాలీమ్ సేల్ నడుపుతున్నారు. సికింద్రాబాద్ వరకు హాలీమ్ డెలివరీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇలా విక్రయించడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించగా.. ‘అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకుంటన్నాం. కుకింగ్, ప్యాకింగ్, డెలివరీ విషయంలో నాణ్యతతోపాటు పరిశుభ్రత ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. ఎవరి నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు’ అని వారు చెప్పుకొచ్చారు. కస్టమర్లకు హాలీమ్ డెలివరీ చేసేందుకు ఖలిందా ఫ్యామిలీ తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆపరేట్ చేస్తోంది. టోలి చౌకీ నుంచి ఓ మహిళ కూడా తన ఇంటి నుంచే చాలా రోజులుగా హాలీమ్ డిష్ అమ్ముతోంది. 

కానీ, ఆమె ఎవరి నుంచి క్యాష్ పేమెంట్లను అనుమతించడం లేదు. కేవలం ఆన్ లైన్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇతర పేమెంట్స్ మోడ్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నట్టు పేర్కొంది. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారి కోసం పరిమితంగా ప్రతిరోజు హాలీమ్ విక్రయిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీనియర్ జీహెచ్ఎంసీ అధికారులు కస్టమర్లలా వెళ్లి ప్రశ్నించగా ఆమె పై విధంగా బదులిచ్చింది. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కూడా మే మొదటివారం నుంచే హాలీమ్ విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంది. తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్లో ఫోన్ నెంబర్ కూడా పోస్టు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎత్తిన ఆ హోటల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయడంలేదు. నిత్యావసర సర్వీసులు అందించేందుకు తమ దగ్గర పాస్ ఉంది. మేం ఫుడ్ డెలివరీ చేయొచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు. 

ఈ వాదనను పోలీసు అధికారులు ఖండించారు. తమ స్టేషన్ పరిధిలో హలీమ్‌తో సహా ఆహారాన్ని విక్రయించే వ్యక్తులపై ఇటీవల చర్యలు తీసుకున్న మొఘల్‌పురా పోలీసు స్టేషన్ హౌస్ కార్యాలయం ఎ. రవి కుమార్ మాట్లాడుతూ.. వండిన ఆహారాన్ని అమ్మడం చట్టవిరుద్ధమని, నేరస్థులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హలీమ్ తయారీకి మాంసం ఉపయోగించే జంతువులను జియాగుడ వంటి ప్రదేశాలలో నగరంలోకి రవాణా చేస్తారు. ఇక్కడ చాలా కోవిడ్ -19 కేసులు ఉన్నాయని అందరికి తెలుసు. అక్కడి నుండి జంతువులు కబేళాలకు వెళ్లి మాంసం వంటశాలలకు చేరుకుంటాయి. వీటిన్నింటిని తనిఖీ చేయడం అసాధ్యం. ఇది చాలా ప్రమాదకరమేనని అంటున్నారు. 

Read Here>> కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త