Hansika : హన్సిక కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా.. అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే??

యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని తను చేసుకోబోయే వరుడ్ని అందరికి పరిచయం చేసింది. ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా...................

Hansika : హన్సిక కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా.. అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే??

Hansika will marriage her friend ex husband

Hansika :  యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని తను చేసుకోబోయే వరుడ్ని అందరికి పరిచయం చేసింది. ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది హన్సిక. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు హన్సికకి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే హన్సికకి కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే అని, వాళ్ళు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2016 లో హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కి రింకీ అనే అమ్మాయితో పెళ్లి అయింది. వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. రింకీ హన్సికకి స్నేహితురాలేనట. సోహెల్ కూడా ఎప్పట్నుంచో హన్సికకి స్నేహితుడు అంట.

Arjun vs Vishwak : అర్జున్ వ్యాఖ్యలకి స్పందించిన విశ్వక్ సేన్ టీం?? అందుకే సినిమా నుంచి తప్పుకున్నాడు..

రింకీ, సోహెల్ విడిపోయిన తర్వాత హన్సికతో సోహెల్ దగ్గరయ్యాడని, వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నాకే ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, నెటిజన్లు ఇది నిజమేనా అని కామెంట్స్ చేస్తూ హన్సికని అడుగుతున్నారు. దీనిపై హన్సిక మాత్రం స్పందించలేదు.