వూహాన్ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా.. బర్నింగ్ స్టార్?

సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా రిలీజ్ పోస్టర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : May 9, 2020 / 08:08 AM IST
వూహాన్ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా.. బర్నింగ్ స్టార్?

సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా రిలీజ్ పోస్టర్ విడుదల..

బర్నింగ్‌ స్టార్ అంటూ ‘హృదయకాలేయం’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూ ప్రస్తుతం మెడికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ‘?’ ఈ సినిమా టైటిల్.. సంపూ నటిస్తున్న 10వ చిత్రం ఇది. ఈ రోజు (శనివారం) సంపూ పుట్టినరోజు.

Sampoo

ఈ సందర్భంగా చిత్రబృందం సంపూకు విషెస్ తెలియజేస్తూ రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తన జన్మదినోత్సవం సందర్భంగా సంపూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘అందరి హీరోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. సదా మీ ప్రేమకి బానిస.. మీ సంపూర్ణేష్ బాబు’ అంటూ సంపూ ట్వీట్ చేశాడు.

Read More : 

‘లవ్ స్టోరి’లో లవ్లీగా సాయిపల్లవి..

30 ఏళ్ల సెల్యులాయిడ్ సెన్సేషన్ ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’..