హ్యాపీ బర్త్‌డే నేచురల్ స్టార్ నాని..

హ్యాపీ బర్త్‌డే నేచురల్ స్టార్ నాని..

Natural Star Nani: సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. సినిమాకి అంచెలంచెలుగా ఎదుగుతూ, నేచురల్ స్టార్‌గా ప్రేక్షకాభినులను అలరిస్తున్న గంటా నవీన్ (నాని) పుట్టినరోజు (ఫిబ్రవరి 24) నేడు.. పక్కింటబ్బాయి, లవర్ బాయ్ రోల్స్‌తో పాటు, ‘జెంటిల్‌మెన్’, ‘వి’ వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలోనూ ఆకట్టుకున్నాడు..

ప్రస్తుతం ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికీ..’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు నాని.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ‘టక్ జగదీష్’ టీజర్ నాని బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది.

Tuck Jagadish

నాని 27వ సినిమా ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యనున్నారు.

Shyam SinghaRoy

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నాని 28వ సినిమా ‘అంటే సుందరానికీ’ రూపొందనుంది. ‘మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు.

Ante Sundaraniki