హ్యాపీ బర్త్‌డే విక్టరీ వెంకటేష్..

  • Published By: sekhar ,Published On : December 13, 2020 / 01:44 PM IST
హ్యాపీ బర్త్‌డే విక్టరీ వెంకటేష్..

Happy Birthday Venkatesh: విక్టరీ వెంకటేష్.. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు.. తెలుగు సినీ పరిశ్రమలో అందరి హీరోల అభిమానులూ అభిమానించే అజాత శత్రువు దగ్గుబాటి వెంకటేష్.. డిసెంబర్ 13న 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు..

Narappa

అగ్ర నిర్మాత డి.రామానాయుడి తనయుడిగా సినీ రంగప్రవేశం చేసినా అతితక్కువ సమయంలోనే తనకంటూ ఓ సొంత గుర్తింపు, ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. 1971లో ‘ప్రేమ న‌గ‌ర్’ సినిమాలో బాల‌న‌టుడిగా క‌నిపించారు. అనంత‌రం 1986లో ‘క‌లియుగ పాండ‌వులు’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలి సినిమాకే నంది అవార్డును ద‌క్కించుకున్నారు.

Venkatesh

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్, మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘స్వర్ణకమలం’, ‘వారసుడొచ్చాడు’ ‘ప్రేమ’, ‘బొబ్బిలిరాజా’, ‘కూలీ నెం.1’, ‘క్షణ క్షణం’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పవిత్రబంధం’ వంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ రూట్ వేసుకోవడమే కాక మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

Venkatesh

‘సూర్యవంశం’, ‘గణేష్’, ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఘర్షణ’, ‘మల్లీశ్వరి’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ ‘గురు’, ‘ఎఫ్ 2’, ‘వెంకీ మామ’.. ఇలా లవ్, కామెడీ, సెంటిమెంట్ అండ్ యాక్షన్ వంటి డిఫరెంట్ పాత్రలతో వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను అలరించారు వెంకీ..

Venky Mama

వెంకీ కెరీర్‌లో తొలిసారిగా తన జన్మదినం నాడు రిలీజ్ అయిన ఏకైక చిత్రం ‘వెంకీ మామ’ కావడం విశేషం. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది.

Venky

వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళనాట ఘన విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌ ‘నారప్ప’ లో నటిస్తునున్నారు.
వెంకీ జన్మదినోత్సవం సందర్భంగా ‘నారప్ప’ గ్లింప్స్‌తో పాటు ‘ఎఫ్ 3’ మూవీని అధికారికంగా ప్రకటించారు.

F3

పవన్ కళ్యాణ్ (గోపాల గోపాల), ఎన్టీఆర్ (చింతకాయల రవి చిత్రంలో స్పెషల్ అప్పీరియన్స్), రామ్ (మసాలా), మహేష్ బాబు (సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు), వరుణ్ తేజ్ (ఎఫ్ 2 & ఎఫ్ 3)  వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు.