సూపర్‌ కపుల్ వెడ్డింగ్ యానివర్సరీ..

సూపర్‌ కపుల్ వెడ్డింగ్ యానివర్సరీ..

Namrata Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల వెడ్డింగ్ యానివర్సరీ నేడు (ఫిబ్రవరి 10). 2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రత ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా గౌతమ్, సితార అనే ఇద్దరు క్యూట్ కిడ్స్ ఉన్నారు. 16వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మహేష్, నమ్రత ఒకరికొకరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.. పిల్లల గౌతమ్, సితార కూడా విషెస్ తెలుపుతూ తల్లిదండ్రులపై తమ ప్రేమని వ్యక్తం చేశారు.

Namrata

‘16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను’.. అని నమ్రత కామెంట్ చేస్తూ.. మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేశారు.
మహేష్ కూడా విషెస్ చెబుతూ నమ్రతను ఆప్యాయంగా ముద్దాడుతున్న పిక్ పోస్ట్ చేశారు.

Mahesh

గతేడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Gautam

Sitara