‘వకీల్ సాబ్’ ఉమెన్స్ డే విషెస్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్‌ బోని కపూర్‌తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో నటించారు. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘మగువా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

‘వకీల్ సాబ్’ ఉమెన్స్ డే విషెస్..

Happy Womens Day: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్‌ బోని కపూర్‌తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో నటించారు. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘మగువా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

Vakeel Saab

నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పవన్ వెనుక ఈ ముగ్గురు నిలబడి ఉన్నారు. ఈ మూవీలో ఉమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్.

వకీల్ సాబ్ – ‘గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు’..

వేసవి కానుకగా ఏప్రిల్ 9న పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ గా థియేటర్లలో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో థియేట్రికల్, డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి.

Vakeel Saab