Harbhajan Singh: “మిగిలిన వాళ్లంతా లస్సీ తాగడానికి వెళ్లారా.. “

ఇండియా చివరిగా 2011లోనే వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఎంఎస్ ధోనీ మ్యాచ్ విన్నింగ్స్ షాట్ కొట్టి శ్రీలంకపై ఫైనల్ ను గెలిపించాడు. అయితే విశ్లేషకులు, విమర్శకులంతా ఇది కేవలం కెప్టెన్..

Harbhajan Singh: “మిగిలిన వాళ్లంతా లస్సీ తాగడానికి వెళ్లారా.. “

Harbhajan Singh

Harbhajan Singh: ఇండియా చివరిగా 2011లోనే వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఎంఎస్ ధోనీ మ్యాచ్ విన్నింగ్స్ షాట్ కొట్టి శ్రీలంకపై ఫైనల్ ను గెలిపించాడు. అయితే విశ్లేషకులు, విమర్శకులంతా ఇది కేవలం కెప్టెన్సీతోనే సాధ్యపడిందని చెబుతుంటారు. రీసెంట్ గానూ అదే జరిగింది. కాకపోతే ఆ విన్నింగ్ టీంలో ఒకడైన హర్భజన్ మాత్రం ఇదంతా టీం వర్క్ అని ఒక్కరి వల్ల జరిగింది కాదనేట్లుగా కాస్త సెటైరికల్‌గా కామెంట్ చేశాడు.

ఐపీఎల్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఢిల్లీ క్యాపిటల్స్ ను 2020 సీజన్ లో ఫైనల్ వరకూ తీసుకెళ్లగలిగిందని అన్నాడు. దాన్ని అక్కడితో ఆపేయలేదు హర్భజన్. “ఏం మిగిలిన ప్లేయర్లంతా గల్లీ దందా కోసం వెళ్లారా” అంటూ ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ గెలిస్తే జట్టు మొత్తానికి క్రెడిట్ దక్కుతుంది. కానీ, ఇండియా గెలిస్తే ఎంఎస్ ధోనీకే ప్రశంసలు దక్కుతున్నాయి ఎందుకని ప్రశ్నించారు.

Read Also: హర్భజన్ సింగ్ తొలి చిత్రం ఫస్ట్ లుక్

“ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు. హెడ్ లైన్స్ లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది. అదే ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంఎస్ ధోనీ వరల్డ్ కప్ గెలిచాడని రాస్తారు. మిగిలిన పది మంది లస్సీ తాగడానికి వెళ్లారా? మిగిలిన పది మంది ప్లేయర్లు ఏం చేస్తున్నారు? గౌతం గంభీర్ ఏం చేశాడు? అంటూ హర్భజన్ సింగ్ కీలక కామెంట్లు చేశాడు.

అక్కడ విజయమనేది ఓ జట్టుగా కలిసి పోరాడితేనే దక్కుతుందని చెప్పే ఉద్దేశ్యాన్ని కనబరిచాడు హర్భజన్. శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రిషబ్ పంత్ ఢిల్లీ పగ్గాలు అందుకుని జట్టును నడిపిస్తున్నాడు.