Hari-Harish : జ్వరంలో కూడా యాక్షన్ సీన్స్ చేసింది సమంత.. సినిమాలో సరోగసి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

సమంత గురించి చెప్తూ.. ''ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా ఈజీగా చేసేస్తారు సమంత. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చారు ఈ సినిమాలో. ఆవిడ ప్రతి టేక్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, మీకు ఓకేనా అని...............

Hari-Harish : జ్వరంలో కూడా యాక్షన్ సీన్స్ చేసింది సమంత.. సినిమాలో సరోగసి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

Hari, Harish promotions for Yashoda Movie

Hari-Harish :  సమంత చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. అదికూడా ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా దర్శకులు హరి, హరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, సమంత గురించి పలు ఆసక్తి విషయాలు తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ.. ”సినిమాలో కేవలం సరోగసి మాత్రమే కాదు, ఇంకా చాలా అంశాలు చూపించాం. సరోగసి సినిమాలో ఒక భాగం అంతే. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాం. మహిళలు, మాతృత్వం గురించి కూడా ఉంటుంది. సినిమా చూస్తే కచ్చితంగా ఆడియన్స్ షాక్ అవుతారు. సినిమా చాలా వరకు సెట్స్ లోనే చేశాం. సినిమాలో ప్రతి 20 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుంది. చిన్న సినిమాగా అనుకున్నాం కానీ కథ నచ్చిందని నిర్మాత పాన్ ఇండియా చేద్దామన్నారు. సమంత గారు ఓకే అన్నాక ఈ సినిమా వ్యాల్యూ చాలా పెరిగింది” అని తెలిపారు.

G.Nageswara Reddy : ఆ విషయంలో విశ్వక్ సేన్‌దే తప్పు.. ప్రముఖ డైరెక్టర్ వ్యాఖ్యలు..

ఇక సమంత గురించి చెప్తూ.. ”ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా ఈజీగా చేసేస్తారు సమంత. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చారు ఈ సినిమాలో. ఆవిడ ప్రతి టేక్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, మీకు ఓకేనా అని అడిగేవారు. సమంత హెల్త్ కండిషన్ గురించి మాకు షూటింగ్ సమయంలో తెలీదు. ఒక యాక్షన్ సీక్వెన్స్ రోజూ ఆమెకి జ్వరం, అది మాకు తెలీదు కానీ మొత్తం షూట్ అయిన తర్వాత తెలిసింది. జ్వరంలో కూడా యాక్షన్ సీన్స్ చేశారు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని అనుకుంటారు” అని చెప్పారు.