Raid: హిందీ సినిమాపై కన్నేసి హరీష్ శంకర్.. తెలుగు రీమేక్ కోసం ప్రయత్నాలు?

హరీశ్ శంకర్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. గతంలో బాలీవుడ్ హిట్ మూవీ దబాంగ్ సినిమాను ఇక్కడి ఆడియన్స్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు హరీశ్ శంకర్.

Raid: హిందీ సినిమాపై కన్నేసి హరీష్ శంకర్.. తెలుగు రీమేక్ కోసం ప్రయత్నాలు?

Raid

Raid: తెలుగు సినిమాలను బాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేస్తుంటే.. బాలీవుడ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి, బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ చేస్తున్న డైరెక్టర్ హరీశ్ శంకర్.. బాలీవుడ్ మూవీ దబాంగ్ ను తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మరో బాలీవుడ్ మూవీ పై కన్నేశాడు.

Harish Shankar: సల్మాన్ కోసం హరీష్ స్క్రిప్ట్.. త్వరలోనే ఫైనల్ చర్చలు?

తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేశారు హరీశ్ శంకర్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వరస సినిమాలతోనూ, అటు పాలిటిక్స్ తోనూ బిజీగా ఉండటంతో ఆ సినిమా పట్టాలెక్కడానికి ఢిలే అవుతుంది. ఈ టైమ్ గ్యాప్ లో హరీశ్ శంకర్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. గతంలో బాలీవుడ్ హిట్ మూవీ దబాంగ్ సినిమాను ఇక్కడి ఆడియన్స్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు హరీశ్ శంకర్.

Harish Shankar: హైపర్ హరీష్.. ఫ్రస్టేషన్, హ్యాపీ.. ఏదొచ్చినా ఆగలేడు!

ఇప్పుడు 2018లోనే రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్ సినిమాను తెలుగు ఆడియన్స్ కి అందించాలని ప్లాన్ చేస్తున్నారు.. అజయ్ దేవగన్ క్యారెక్టర్ ను ఫుల్ ఫిల్ చేసే స్టార్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ముంబైకి వెళ్లిన హరీశ్ శంకర్ రైడ్ సినిమా ప్రొడ్యూసర్ పనోరమా స్టూడియోస్ కుమార్ మంగత్ పాఠక్ ను కలిశారు. తెలుగు రీమేక్ ను కూడా ఆయనే నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. రైడ్ రీమేక్ కూడా గబ్బర్ సింగ్ తరహాలోనే బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు.

Harish Shankar-Chiranjeevi: హరీష్-చిరు.. మరో మలయాళ రీమేక్ ప్లాన్స్?!

ఇక తమిళ సినిమా జిగర్తాండను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ సినిమా చేసి, బాక్సాఫీస్ ముందు సక్సెస్ కొట్టిన హరీశ్ శంకర్ ది రీమేక్ సినిమాలను హిట్ చేయడంలో అందె వేసిన చేయి అని ఆల్రెడీ ప్రూవ్ చేశారు. 1980స్ లో లక్నోలో జరిగిన త్రీ డేస్, టు నైట్స్ సుదీర్ఘమైన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా అజయ్ దేవగన్ రైడ్. అదే సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా రీమేక్ చేస్తారా, లేక గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ తరహాలో మార్పులు చేర్పులు చేసి, హిట్ కొడతాడా? స్టార్ క్యాస్టింగ్ ఎవరైతే బాగుంటుంది..? అని ఇప్పటి నుంచే చర్చింటచుకుంటున్నారు సినీ అభిమానులు. ఈ మధ్య కాలంలో ఇక్కడి దర్శకులు, ఇక్కడి సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ లు చేసి, సక్సెస్ అవుతుంటే హరీశ్ శంకర్ మాత్రం ఇతర భాషా చిత్రాలను తెలుగులో రిమేక్ చేసి, సక్సెస్ అవుతున్నారు.