కరోనావైరస్‌ను గుర్తించగానే.. ఈ ఫేస్ మాస్క్‌ల్లో లైట్లు వెలుగుతాయి!

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 05:18 AM IST
కరోనావైరస్‌ను గుర్తించగానే.. ఈ ఫేస్ మాస్క్‌ల్లో లైట్లు వెలుగుతాయి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్‌లు రాబోతున్నాయి. సాధారణ మాస్క్ ల మాదిరిగా కాకుండా ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్ల ఆధారంగా కరోనా వైరస్ బాధితులను వెంటనే గుర్తించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకకుండానే ముందుగానే జాగ్రత్త పడొచ్చు అంటున్నారు హార్వర్డ్, MIT రీసెర్చర్లు. ఇప్పడు కరోనా వైరస్ ను వెంటనే గుర్తించే మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. గత ఆరేళ్లుగా బయో ఇంజినీర్లు జికా వైరస్, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్‌లను గుర్తించే సెన్సార్లను డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త కరోనా వైరస్‌ను గుర్తించేందుకు సెన్సార్లతో కూడిన ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తున్నట్టు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మినా లేదా దగ్గినప్పుడు వెంటనే ఈ ఫేస్ మాస్క్‌లోని సెన్సార్ల సిగ్నల్స్ ద్వారా లైట్లు వెలుగుతాయి. 

2014లోనే అమెరికన్ రీసెర్చర్ Jim Collins తన బయో ఇంజినీరింగ్ ల్యాబరేటరీ అయిన MITలో సెన్సార్లను డెవలప్ చేయడం ప్రారంభించారు. ఈ సెన్సార్ల ద్వారా ఎబోలా వైరస్ ను సులభంగా గుర్తించడం సాధ్యపడింది. ఒక పేపర్ ముక్కపై సెన్సార్ల ద్వారా గుర్తించారు. దీనికి సంబంధించి రీసెర్చ్‌ను MIT, హార్వర్డ్ కు చెందిన కొంతమంది చిన్న శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఆ తర్వాత జికా వైరస్ ముప్పుపై కూడా సెన్సార్లను డెవలప్ చేసింది ఈ బృందం.. ఇప్పుడు ఇదే బృందం తమ సెన్సార్ టూల్స్ సవరించి కరోనా వైరస్ కేసులను గుర్తించే పనిలో పడింది.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, తుమ్మడం, దగ్గినప్పుడు fluorescent సిగ్నల్ ఉత్పత్తి చేసే ఫేస్ మాస్క్ లను డెవలప్ చేస్తోంది ఈ బృందం. ఒకవేళ ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే.. టెంపరేచర్ చెకింగ్ వంటి ఇతర స్క్రీనింగ్ పద్ధతులతో సంబంధం ఉన్న లోపాలను పరిష్కరించగలదని అంటోంది. ఎయిర్ పోర్టుల నుంచి ఆస్పత్రుల వరకు అన్నిచోట్ల ఈ టూల్స్ ద్వారా స్ర్కీనింగ్ చేయొచ్చునని అంటున్నారు. కరోనాను గుర్తించేందుకు ల్యాబరేటరీకి ఎలాంటి శాంపిల్స్ పంపాల్సిన అవసరం లేకుండానే ఉన్నచోటనే కరోనా బాధితులను సులభంగా గుర్తించవచ్చునని రీసెర్చర్ Jim Collins అంటున్నారు. 

ప్రస్తుతం ఈ ల్యాబ్ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని కాలిన్స్ చెప్పారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా, అతని బృందం చిన్న లాలాజల నమూనాలో కరోనావైరస్‌ను గుర్తించే సెన్సార్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. కరోనా లాంటి వైరస్ లను గుర్తించేందుకు మొదట్లో తాము తేలికైన కాగితంపై సెన్సార్లను అమర్చి విశ్లేషించినట్టు కాలిన్స్ తెలిపారు. ఇప్పుడు ఈ టూల్స్ ప్లాస్టిక్, క్వార్జ్, వస్త్రాలపై కూడా పనిచేస్తుందని నిర్ధారించినట్టు తెలిపారు. వైరస్‌ను గుర్తించే సెన్సార్లను జన్యు పదార్థం DNA, RNA లతో కలిసి ఉంటుందని అన్నారు. 

లైయోఫిలిజర్ అని పిలిచే యంత్రాన్ని ఉపయోగించి వస్త్రంపై ఉండే పదార్థం స్తంభింపచేస్తుంది. ఇది జన్యు పదార్ధం నుండి తేమను చంపకుండా పీల్చుకుంటుంది. ఇది చాలా నెలలు గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది. సెన్సార్లను యాక్టివేట్ చేయడానికి రెండు విషయాలు అవసరం. మొదటిది తేమ, మన శరీరాలు శ్లేష్మం లేదా లాలాజలం వంటి శ్వాసకోశ కణాల ద్వారా ఇస్తాయి. రెండవది వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టులకు 24 గంటల వరకు సమయం పడుతోంది. పేషెంట్లకు టెస్టు ఫలితాలు కూడా చాలా రోజులు పడుతోంది. ఏదిఏమైనా ఈ సమ్మర్ ముగిసేనాటికి సెన్సార్ ఫేస్ మాస్క్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కాలిన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read Here >> కావాలనే కరోనా వైరస్ అంటించుకున్న అమెరికా ఖైదీలు..విడుదల కావటానికి ప్లాన్