Haryana : 210 కిలోల బరువు ఎత్తకపోతే కర్రతో తలపై కొడతాడట.. వార్నింగ్ ఇస్తున్న జిమ్ ట్రైనర్
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్‌ను కర్రతో కొడతా అని బెదిరించాడు.

Haryana
Haryana Video Viral : ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తడంలో ఫెయిల్ అయితే తన క్లయింట్‌ను కర్రతో కొడతానని బెదిరించాడు. హర్యానా జిమ్ ట్రైనర్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Woman doing gym in saree : చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నమహిళ వీడియో వైరల్
Gabbar అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో హర్యానాకు చెందిన ఓ జిమ్ ట్రైనర్ శిక్షణ ఇస్తుంటాడు. అతని శిక్షణ చూపరులకు చాలా కఠినంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి బరువు ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటే మరో వ్యక్తి అతనికి సాయం చేస్తుంటాడు. వెనుక నిలబడ్డ ట్రైనర్ ‘ ఊపిరి పీల్చుకోండి.. మీరు బరువు ఎత్తలేకపోతే నేను నిన్ను కొడతాను’ అంటూ అరిచాడు. ‘మీరు ఈరోజు 210 కిలోల బరువు ఎత్తకపోతే మీ బ్యాగ్ తీసుకుని జిమ్ నుంచి బయలుదేరండి.. నేను మిమ్మల్ని తిరిగి రానివ్వను’ అని చెప్పడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Fitness Workouts : ఇంటి వ్యాయామాలు vs జిమ్ వర్కౌట్‌లు వీటిలో ఏది సరైనది?
‘ఇలాంటి ట్రైనర్ ఉంటే నా ఫ్యామిలీ ఫిట్ గా తయారవుతుంది’ అని ఒకరు.. ‘ఏదైనా గాయం అయితే ఆ ట్రైనర్ బాధ్యత వహిస్తారా?’ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొంతమంది క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ అని అభిప్రాయపడ్డారు.
And you wonder how come Gurgaon dudes are doing push-ups on top of a running car pic.twitter.com/7UxsI19AYg
— Gabbar (@GabbbarSingh) June 7, 2023
— Vaibhav Matere (@vaibhav_matere) June 7, 2023