నవ్వుతూ మాట్లాడిందని వెంటపడ్డాడు..ఛీ కొట్టిందని పొడిచేశాడు

నవ్వుతూ మాట్లాడిందని వెంటపడ్డాడు..ఛీ కొట్టిందని పొడిచేశాడు

man attack to women software engineer : అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు నన్ను ప్రేమించేస్తుందనుకున్న అబ్బాయిలు తెగ ఫీలైపోతారు. నాకు ఓ అమ్మాయి పడిపోయిందంటూ కాలర్ ఎగరేస్తారు. నవ్వుతూ పలుకరిస్తే ప్రేమనుకున్నాడో అబ్బాయి. నవ్విన అమ్మాయితో చాలాసార్లు మాట్లాడేవాడు. ఆమెతో కలిసి వాళ్ల ఇంటికి కూడా వెళ్లాడు. అతడు అది ప్రేమ అనుకున్నాడు. ఆమె కాదు అనుకుంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి కుదిరింది. దీంతో ఆమె అతనిని పలకరించటం మానేసింది. దీంతో ఉన్మాదిగా మారి ఆమెను కత్తితో పొడిచేసాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బండ్లగూడలో చోటుచేసుకుంది.

హర్యానాకు చెందిన షారూఖ్ సల్మాన్‌ అనే 29 ఏళ్ల యువకుడు ఉపాధి కోసం ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. బండ్లగూడలోని హైదర్షాకోట్‌ సన్‌సిటీలోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్నాడు. అతనికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే ఓ యువతిదో పరిచయం అయ్యింది. ఆమె కుటుంబం కూడా హైదర్షాకోట్‌ సన్‌సిటీలో నివాసముంటోంది. ఓ రోజు షారుఖ్‌ పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లిందామె.

షారూఖ్ ను నవ్వుతూ పలుకరించింది. అలా షాపుకు వచ్చినప్పుడల్లా నవ్వుతూనే మాట్లాడేది. రెండుమూడు సార్లు ఆమె ఇంటికి కూడా వెళ్లాడు. దానినే ప్రేమ అనుకొన్నాడు. అలా చాలా సార్లు నవ్వుతూ ఆమె మాట్లాడటంతో ఆమె తనను ప్రేమిస్తోందనుకున్నాడు. దీంతో ఓ రోజున షారూఖ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దానికి ఆమె నేను నిన్ను ప్రేమించట్లేదు..జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాను అంతే..ఇంక నామీద ఆశలు పెంచుకోవద్దు..నాకు పెళ్లి కూడా సెటిల్ అయ్యిందని కరాఖండీగా చెప్పేసింది..

అప్పటినుంచి అతడిని దూరం పెట్టింది. దీంతో ద్వేషం పెంచుకొన్న షారుఖ్‌ .. ఆమె మంగళవారం (ఫిబ్రవరి 2,2021) సాయంత్రం ఆమె ఆఫీసునుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక ఫాలో అయ్యాడు. అలా ఆమె ఇంటికి దగ్గరకొచ్చేసింది. అదే సమయంలో వెనుకనుంచి కత్తితో పొడిచి పరారయ్యాడు.

దీంతో ఆమె కేకలు వేయటంతో చుట్టు పక్కలవారు..కుటుంబ సభ్యులు కూడా వచ్చిచూడగా..బాధతో విలవిల్లాడుతూ రోడ్డు మీద పడి ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.