Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు

దాదాపు రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన హర్యాణీ సింగర్ హత్యకు గురైంది. సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్నేహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు

Haryanvi Singer

Haryanvi Singer Killed: దాదాపు రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన హర్యాణీ సింగర్ హత్యకు గురైంది. సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్నేహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్యాణాకు చెందిన సంగీత (26) అనే గాయని ఢిల్లీలో ఉంటోంది.

Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

కాగా, ఈ నెల 11న సంగీత ఒక మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం తన స్నేహితులైన రవి, రోహిత్‌తో కలిసి హర్యాణాలోని భివాని అనే సిటీకి వెళ్లింది. అప్పట్నుంచి ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంగీత స్నేహితులే ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో రవిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని విచారించగా, తామే హత్య చేసినట్లు అంగీకరించాడు.

Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య

ఈ కేసులో మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మృతదేహాన్ని రోహ్‌తక్ పట్టణంలోని ఒక ఫ్లై ఓవర్ సమీపంలో పాతిపెట్టారు. ఈ సమాచారంతో పోలీసులు ఫ్లై ఓవర్ పక్కన తవ్వి, సంగీత మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టమ్ కోసం తరలించారు. కాగా, ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.