Viral Video: మీరెప్పుడైనా కొబ్బరి బోండాను ఇలా తాగారా? ట్రై చేస్తారా?

కొబ్బరి బోండాలోని వాటర్ ను మీరు ఎలా తాగుతారు? బోండాల విక్రయదారుడు బోండా పైభాగంను తొలగించి ఇస్తేనే కదా.. కానీ ఇక్కడ ఓ చిలుక ఏకంగా కొబ్బరి చెట్టుపైకి వెళ్లి బోండాకు రంధ్రం చేసుకొని పైకెత్తి మరీ తాగేసంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video: మీరెప్పుడైనా కొబ్బరి బోండాను ఇలా తాగారా? ట్రై చేస్తారా?

Coconut Water

Viral Video: కొబ్బరి బోండా వాటర్‌లో అనేక పోషకాలుంటాయి. వేసవిలో ప్రతిఒక్కరూ వీటిని సేవిస్తూనే ఉంటారు. కొబ్బరి బోండా తాగాలంటే బోండాల విక్రయ దారుడు ఓ పొడవాటి కత్తితో బోండా మూతిపైభాగం తొలగించి ఇస్తాడు. అప్పుడు మనం దానిలో ఓ స్ట్రా వేసుకొని ఏంచక్కా తాగేస్తాం.. కానీ, ఇక్కడ ఓ చిలుక కొబ్బరి బోండాను అవలీలగా తాగేసింది. అదీ.. కొబ్బరి బోండా విక్రయదారుడు అందిస్తే కాదు.. ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కి నోటితో గటగటా తాగేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

Hyderabad Rains: అయ్యయ్యో దొరక్కపాయె! హైదరాబాద్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన వాషింగ్ మిషన్.. వీడియో వైరల్

ఈ వీడియోను ఐఎఫ్ ఎస్ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. నాకు చాలా దాహమేస్తోంది అంటూ శీర్షికను ఇచ్చాడు. ఈ వీడియోలో ఓ రామ చిలుక కొబ్బరి చెట్టు పైకి వెళ్తుంది. కొబ్బరి బోండాను తుంచుకొని దాని ముక్కుతో రంధ్రం చేయండ ఈ వీడియోలో చూడొచ్చు. ఆ తరువాత దాని నోటితో కర్చుకొని పైకెత్తి అవలీలగా కొబ్బరి బోండాలో నీటిని తాగేస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది నెటిజన్లు వీక్షించారు. అనేక మంది చిలుక తెలివిని చూసి అద్భుతంగా ఉంది అంటూ కితాబిస్తున్నారు.