Sidhu Moose Wala: హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిద్దూ కేసు విచారణకు ఆదేశించిన పంజాబ్ సీఎం

సిద్ధూ మూస్ వాలా (అలియాస్) శుభదీప్ సింగ్ సిద్ధూ హత్యపై దర్యాప్తుకు పంజాబ్ సీఎం భగవత్ మన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Sidhu Moose Wala: హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిద్దూ కేసు విచారణకు ఆదేశించిన పంజాబ్ సీఎం

Punjab Cm

 

 

Sidhu Moose Wala: సిద్ధూ మూస్ వాలా (అలియాస్) శుభదీప్ సింగ్ సిద్ధూ హత్యపై దర్యాప్తుకు పంజాబ్ సీఎం భగవత్ మన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

హత్యకు గురైన వ్యక్తి తండ్రి బాల్కర్ సింగ్ సిద్ధూ అభ్యర్థన మేరకు సీఎం ఈ కేసును పంజాబ్, హర్యానా సిట్టింగ్ జడ్జితో విచారించాలని నిర్ణయించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రిక్వెస్ట్ చేస్తుందని వివరించారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) వంటి కేంద్ర ఏజెన్సీలతో సహా ఈ విచారణ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని మాన్ తెలిపారు. ఈ ఘటనపై జరిగిన మీడియా సమావేశానికి వివరణ ఇవ్వాలని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని కోరారు.

Read Also: పంజాబ్ జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు.. సీఎం నిర్ణయం

త్వరితగతిన కేసును సమగ్ర దర్యాప్తు కోసం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు భగవంత్ మాన్ స్పష్‌టం చేశారు సిద్ధూ మూస్ వాలా అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం, పంజాబ్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు, సాంస్కృతిక చిహ్నంగా అభివర్ణించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.