HCA Azharuddin- Apex Council : హెచ్‌సీఏలో ఆధిపత్య పోరు : అసలేం జరుగుతుంది?

తనపై వేటు వేయడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు.. తనకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడు పనిచేయలేదని అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.

HCA Azharuddin- Apex Council : హెచ్‌సీఏలో ఆధిపత్య పోరు : అసలేం జరుగుతుంది?

Hca President Azharuddin Responds On Apex Council Showcause Notices

HCA President Azharuddin on apex council  : తనపై వేటు వేయడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు.. తనకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడు పనిచేయలేదని అజారుద్దీన్ వివరణ ఇచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది ఉంటే.. మంది ఒక వర్గంగా ఏర్పడి.. తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలానని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్ మెన్‌గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పు పట్టారని విమర్శించారు. అందుకు కారణం… వాళ్ళ తప్పుడు పనులు, వాళ్ల అవినీతి బయట పడుతుందనే.. హెచ్‌సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని చెప్పారు.

అడ్డుకోవాలని చూస్తున్న తనపై బురద చల్లుతున్నారని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి కూడా ఆ అయిదుగురు హాజరవుతున్నారని అన్నారు. జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ…. ఈ ఐదుగురి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వీళ్ల అవినీతికి తాను అడ్డుపడుతున్నానే వాళ్లకు వాళ్లు  మీటింగ్ పెట్టుకుని నాకు నోటీసులు ఇచ్చారని, కానీ, అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు.

ఏకపక్ష నిర్ణయాలతోనే నోటీసులు : 
మరోవైపు.. హెచ్‌సి‌ఏ‌లో అజార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు అందజేసిందని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అందరు ఓ వైపు ఉంటే అజారుద్దీన్ ఒక్కడే ఓ వైపు ఉన్నాడని అన్నారు. ఇది ఇది హెచ్‌సీఏ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. హెచ్‌సీఏ పాలకమండలిలో జనరల్ బాడీ సమావేశంలో అజారుద్దీన్ నేను చెప్పిందే నడవాలి అంటూ డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. ఇలా చేయడం వల్ల యువ క్రికెటర్లకు అవకాశం రాకుండా పోతుందన్నారు. హెచ్‌సీఏ‌కి అజార్ అందుబాటులో ఉండక పోవడంతో కమిటీ సభ్యులు అజార్‌పై అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని నారాయణ్ చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన షోకాజ్ నోటీసులకి ఏ విధంగా అజార్ స్పందిస్తారో చూడాలన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ ఏకతాటిపై ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

అపెక్స్ కమిటీ కౌంటర్..
అజార్ వ్యాఖ్యలపై అపెక్స్ కమిటీ కౌంటర్ ఇచ్చింది.. లోధా సిఫార్సుల నిబందనల మేరకే నోటీసులు జారీ చేశామని తెలిపింది. అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరుగురి‌లో ఐదుగురు సభ్యులం షోకాజ్ నోటీస్ పంపించామని పేర్కొంది. ఆ ఐదుగురు ఒక గ్రూప్ అని అజార్ అనడం కరెక్ట్ కాదన్నారు. ఆ ఐదుగురే అపెక్స్ కమిటీ.. అపెక్స్ కమిటీ ఎలెక్టెడ్ బాడీ అపెక్స్ కమిటీలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. అందులో ఒకరు ప్రెసిడెంట్ అజార్, రెండు మెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు, ఉమెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు మిగతా ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ ఆ ఐదుగురు తీసుకున్న నిర్ణయంతోనే షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఈ రోజు నుండి అజారుద్దీన్ ప్రెసిడెంట్ కాదు.. ఇందులో బిసిసిఐ జోక్యం ఉండదని అపెక్స్ కమిటి పేర్కొంది. హెచ్‌సి‌ఏ మీటింగ్‌కు అజార్ వ్యక్తిగతంగా అజారుద్దీన్‌లా వస్తాడని, ప్రెసిడెంట్‌లా రాడని అవసరమైతే దీనిపై అజారుద్దీ‌న్ కోర్టుకు వెళ్లవచ్చునని అపెక్స్ కమిటీ తెలిపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో ఆధిపత్య పోరుతో ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే వేటు పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజార్ పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

హెచ్‌సీఏలో అజర్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. అజ్జూ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు భగ్గుమన్నాయి. ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ అందుకు వేదికగా నిలిచింది. అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే వేటు పడినట్టు అర్థమవుతోంది. తాజాగా అజర్ కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది.