Leafy Greens : ఆకు కూరలతో గుండె పదిలం!

బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకు కూరలు తీసుకోవాలి. ఆకు కూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరిగా అవసరం అవుతుంది.

Leafy Greens : ఆకు కూరలతో గుండె పదిలం!

Leafy Greens

Leafy Greens : ఆరోగ్యానికి ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శరీరానికి కావాలసిన పోషకాలు సమకూరుతాయి. వీటిలో ప్రధానమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువమొత్తంలో ఉంటాయి. వీటి వల్ల రక్షణ లభిస్తుంది. ఆకు కూరల్లో ఇనుము, కాల్సియం, మిటమిన్ ఎ, రైబోఫ్లానివ్ యాసిడ్ లు ఉంటాయి. ఆకు కూరల్లో అధికమొత్తంలో పీచు పదార్ధం లభిస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉండేలా చూస్తుంది. ఆకు కూరల్లోని ఫైటో నూట్రియంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకు కూరలు తీసుకోవాలి. ఆకు కూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరిగా అవసరం అవుతుంది. శరీరంలో తగిన మోతాదులో విటమిన్ ఎ లేకపోతే కనుగుడ్లు తేమను కోల్పోతాయి. తెల్లగా కనిపిస్తాయి. పొడిగా ముడతలు పడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంటిలో కార్నియా దెబ్బతింటుంది.

పాలకూర, బచ్చలి, పుదీనా వంటి వాటిని కూరులుగా కంటే సలాడ్ల రూపంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ముదురు ఆకుపచ్చని ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు దరి చేరకుండా చూసుకోవచ్చు. పచ్చి ఆకు కూరలైన గోంగూర, తోటకూర, బచ్చలి, ఆవాలు, క్యాబేజీ, కొత్తిమీర, మెంతి ఆకులు, పుదీనా, మొదలైనవి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఆకు కూరల్లో తక్కువ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఆకు కూరలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల బరువును సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.