Weather Alert: మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

10TV Telugu News

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండిపోగా పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. తాజాగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, వరదల వల్ల ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

ఇంతకుముందు శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లాలలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో శుక్రవారం రెడ్ అలర్ట్ పక్రటించగా.. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో శనివారం మరోసారి రెడ్ అలెర్ట్ ఇచ్చింది.

10TV Telugu News