Andhrapradesh: ఠారెత్తిస్తున్న ఎండలు.. వాన జాడ ఎక్కడ?

మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల ఆగమనం పదిరోజుల క్రితమే జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులు కురిశాయి. తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం వారం గడిచే సరికి వాతావరణం వేడెక్కింది.

Andhrapradesh: ఠారెత్తిస్తున్న ఎండలు.. వాన జాడ ఎక్కడ?

Andhrapradesh

Andhrapradesh: మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల ఆగమనం పదిరోజుల క్రితమే జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులు కురిశాయి. తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం వారం గడిచే సరికి వాతావరణం వేడెక్కింది. వానల సంగతేమో కానీ ఇప్పుడు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5,6 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఒక్క తూర్పుగోదావరి జిల్లానే తీసుకుంటే సోమవారం అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎండల పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5,6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం రెండుచోట్ల 40 డిగ్రీలు దాటగా… అధికశాతం ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీలలోపు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో 41.1, గుంటూరు జిల్లా బాపట్లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమతో పోలిస్తే కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలున్నాయి.

ఇక వర్షపాతం విషయానికొస్తే.. సాధారణ వర్షపాతమే ఉంది. నెల్లూరులో 68.9%, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో 50% వరకు లోటు వర్షపాతం నమోదవగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ సాధారణం కంటే 32.4 నుంచి 47.7% వరకు తక్కువ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలుల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. అనంతపురంలో 81.2, కడపలో 76.8% చొప్పున అధిక వానలు కురిశాయి.

జూన్ మొదటి వారంలో ఆశలు రేకెత్తించేలా ఉన్న వాతావరణ కాస్త నెల చివరి నాటికి ఆశలు సన్నగిల్లేలా చేసింది. ఇప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాత్రికి ఈదురుగాలులు హోరెత్తుస్తుంది. అయితే.. రుతుపవనాల బలంలేక వర్షాలు కురవడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి బలహీన పడటంతో రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా లేవని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అయితే.. బ్రేక్ మాన్సూన్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.