Hema Malini: రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోల్చడం.. హేమమాలిని కామెంట్స్!

తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్‌ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం..

Hema Malini: రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోల్చడం.. హేమమాలిని కామెంట్స్!

Hema Malini

Hema Malini: తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్‌ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలను శివ‌సేన సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ సైతం కొనసాగిస్తూ అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల మాదిరి రోడ్లను తయారుచేస్తానని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి, మాజీ ఎంపీ హేమమాలిని స్పందించారు.

Samantha Special Song: బాబోయ్.. సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు!

రోడ్లను ఇలా నటీమణుల బుగ్గలతో పోల్చడం నేతలకు ఈరోజు కొత్తేమీ కాదని.. ఈ సంప్రదాయాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ తొలిసారి మొదలుపెట్టారని.. ఆ తర్వాత 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్‌ పాండె కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. కాగా, ఇప్పుడు అదే తరహా సాంప్ర‌దాయాన్ని అంద‌రూ అనుస‌రిస్తున్నార‌న్నారు. అయితే, ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదన్న ఆమె.. సాధార‌ణ ప్ర‌జ‌లు ఇలాంటి కామెంట్స్‌ చేస్తే పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. ప్ర‌జాప్ర‌తినిధులు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మంచిది కాద‌న్నారు.

Naina Ganguly: నైనా.. అసలేంటీ అందాల అరాచకం!

ఇక, మ‌హారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ తనపై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోవడం లేదని.. అది వారి సంస్కారానికే వదిలేస్తున్నానని హేమమాలిని చెప్పుకొచ్చారు. మొత్తంగా ప్రజలకు బాగా తెలిసిన హీరోయిన్స్ చెంపలతో రోడ్లను పోల్చడం.. బుగ్గల మాదిరి రోడ్లను నిర్మిస్తామని చెప్పడం రాజకీయ నాయకులకు బాగా అలవాటైనట్లు కనిపిస్తుండగా.. అసలు ఆ రోడ్లను మళ్ళీ పట్టించుకుంటున్నారా.. లేక కేవలం ఇలా మాటలకే పరిమితమవుతున్నారా అన్నది ఆ నాయకులకే తెలియాలి.

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!