Face Packs : చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే 5 రకాల ఫేస్ ప్యాక్స్ ఇవే!.

పది రోజుల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే, ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని

Face Packs : చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే 5 రకాల ఫేస్ ప్యాక్స్ ఇవే!.

Face Packs

Face Packs : నలుగురిలో ఉన్నప్పడు చాలా మంది ఇతరులకు తాము అందంగా కనిపించాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల ఫేస్ క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే డబ్బులు వెచ్చించి వాటిని కొనుగోలు చేసే బదులు అందుబాటులో ఉండే పదార్ధాలతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుని ఏంచక్కా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మెరిసే చర్మం కోసం 5 రకాల ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్: చర్మం తెల్లగా నిగారింపు కోసం గంధం పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. గంధం పొడిని బాదంతో చేర్చి పొడి చేసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమంను పాలతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.

లోటస్ ఫేస్ ప్యాక్: తాగా ఉండే తామరపువ్వుల నుండి రేకులను విడిగా తీసుకొని, వాటికి కొద్దిగా తేనె, పాలు చేర్చి, పేస్ట్ గాలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వారానికి ఒక సారి ప్యాక్ వేసుకోవడం వల్ల మీ చర్మం తెల్లగా మరియు నేచురల్ గా మారుతుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్: సిట్రస్ పండ్లు చర్మం తెల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి . ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, ఆపొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ ఫేస్ ప్యాక్: పది రోజుల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే, ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని 15నిముషాలు అలాగే వదిలేసి, ఎండిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మఛాయ మెరుగుపరచడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

స్ట్రాబెర్రీ ఫేస్ ఫ్యాక్: స్ట్రాబెరీను బాగా మెత్తగా చిదిమి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత ముఖంను రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.ఈ స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ చర్మఛాయను మెరుగుపరుస్తుంది. మీరు అందంగా కనబడుతారు.