Apple iPhone 14 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. అదిరే ఫీచర్లు.. భారత మార్కెట్లో ధర ఎంతంటే?

Apple iPhone 14 : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఏ కాంతిలోనైనా మెరుగైన ఫోటోల కోసం అధునాతన కెమెరాను కలిగి ఉంది.

Apple iPhone 14 : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఏ కాంతిలోనైనా మెరుగైన ఫోటోల కోసం అధునాతన కెమెరాను కలిగి ఉంది. మీరు సరికొత్త Apple iPhone మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అదిరిపోయే ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో, అమెజాన్ మీకు iPhone 14ని రూ. 57,100కి కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ డీల్ ఎలా పని చేస్తుందో ఆశ్చర్యపోతున్నారా? iPhone 14 128GB స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం Amazonలో రూ.78,400 వద్ద లిస్టు అయింది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లోని లిస్టింగ్ ప్రకారం.. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఫోన్ కొనుగోలుపై రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 73,400కి తగ్గుతుంది. iPhone 13 కొనుగోలు కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడంపై రూ. 16,300 వరకు అదనపు తగ్గింపు ఆఫర్‌ను కలిగి ఉంది. ఈ తగ్గింపుతో ఈ-టైలర్ సైట్ నుంచి రూ. 57,100కి iPhone 14ని కొనుగోలు చేయవచ్చు.

Here’s how you can get iPhone 14 at Rs. 57,100 on Amazon

ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్లు ఇవే :
Apple iPhone 14 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజీతో ఆప్షన్లతో Apple A15 బయోనిక్ చిప్‌సెట్ డివైజ్‌కు పవర్ అందిస్తుంది. హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందించవచ్చు. వెనుకవైపు 12MP ప్రైమరీ సెన్సార్ మరొక 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో అందిస్తుంది. ఫ్రంట్ సైడ్‌లో హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీల కోసం.. 12MP TrueDepth కెమెరా ఉంది.

స్మార్ట్‌ఫోన్ 30 fps వరకు 4K డాల్బీ విజన్ సపోర్ట్‌తో సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంది. మృదువైన, స్థిరమైన, హ్యాండ్‌హెల్డ్ వీడియోల కోసం యాక్షన్ మోడ్ కూడా ఉంది. Apple ప్రకారం.. iPhone 14లో 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదు. ఈ డివైజ్ 5G రెడీ సపోర్టుతో వచ్చింది. FaceID అన్‌లాక్‌తో వస్తుంది. ఐఫోన్ 14లో అత్యవసర SOS, క్రాష్ డిటెక్షన్ వంటి అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై కాల్ హిస్టరీని యూజర్లు ట్రాక్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు