IPL 2022 Final: ఐపీఎల్ విజేతగా గుజ‌రాత్ టైటాన్స్ నిలుస్తుందా.. సురేష్ రైనా ఎందుక‌లా అన్నాడంటే..

ఐపీఎల్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 8గంట‌ల‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అస‌లుసిస‌లైన యుద్ధం మొద‌ల‌వుతుంది. క్వాలిఫయర్- 1లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన విష‌యం విధిత‌మే. సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు క్వాలిఫయర్ -2లో...

IPL 2022 Final: ఐపీఎల్ విజేతగా గుజ‌రాత్ టైటాన్స్ నిలుస్తుందా.. సురేష్ రైనా ఎందుక‌లా అన్నాడంటే..

Raina

IPL 2022 Final: ఐపీఎల్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 8గంట‌ల‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అస‌లుసిస‌లైన యుద్ధం మొద‌ల‌వుతుంది. క్వాలిఫయర్- 1లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన విష‌యం విధిత‌మే. సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు క్వాలిఫయర్ -2లో రాయల్ ఛాలెంజర్స్ (బెంగళూరు)ను అధిగమించి ఫైన‌ల్ కు చేరుకుంది. అయితే గుజ‌రాత్ ఫైన‌ల్‌కు చేరిన‌ప్ప‌టికీ ఫైన‌ల్ లో నెగ్గాలంటే ఒత్తిడిని త‌ట్టుకోవటం ముఖ్య‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

IPL 2022 Final: నేడు ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌.. గెలుపు అవ‌కాశాలు ఎవ‌రికి ఎక్కువ‌ అంటే..

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ లో విజేత‌గా నిలిచే అవ‌కాశాలు గుజ‌రాత్ టైటాన్స్ కు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు భార‌త మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉంద‌ని, బ్యాటింగ్‌, బౌలింగ్ లోనూ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కంటే గుజ‌రాత్ టైటాన్స్ మెరుగ్గా ఉంద‌ని సురేష్ రైనా తెలిపాడు. దీనికితోడు గుజరాత్ టైటాన్స్ ప్లేయ‌ర్స్ కు నాలుగైదు రోజులుగా విశ్రాంతి ల‌భించింది. దీనికితోడు ఆ జ‌ట్టు ప్లేయ‌ర్స్ మంచి ఫామ్ లో ఉండ‌ట‌మే గుజ‌రాత్ కు ఐపీఎల్ విజేత‌గా నిలిచే అవ‌కాశాల ఎక్కువ ఉంటాయ‌ని రైనా తెలిపాడు. అలా అని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌లేమ‌ని, ముఖ్యంగా స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ నిల‌బ‌డితే గుజ‌రాత్ టైటాన్స్ గెలుపు క‌ష్టంగా మారుతుంద‌ని రైనా చెప్పాడు.

IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్‌ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!

మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఫైన‌ల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్ప‌టికే రాజ‌స్తాన్ జ‌ట్టు ఓసారి ఆడింద‌ని, గ్రౌండ్ అల‌వాటుగా మారుతుంద‌ని, దీంతో రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టుకు లాభిస్తుంద‌ని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపున‌కు ఉన్న అవ‌కాశాల‌ను స్మిత్ వివ‌రించాడు. అవుట్‌ఫీల్డ్, పిచ్, అదనపు బౌన్స్‌కు అలవాటు పడ్డార‌ని, కానీ ఇది ఒక ఆఫ్ గేమ్ అని నేను భావిస్తున్నాన‌ని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్‌లలో సీనియ‌ర్ ఆటగాళ్లలో ఎవరైనా ఒక్క‌రు నిల‌బ‌డినా భారీ ప్రదర్శన క‌న‌బ‌ర్చ‌వ‌చ్చు. అది జట్టు గెలుపున‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ రెండు జట్ల‌లో హిట్ట‌ర్లు, మంచి బౌల‌ర్లు ఉన్నారు. క‌చ్చితంగా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌డం ఖాయం. క్రికెట్ ప్రేమికుల‌కు ఇది మ‌రిచిపోలేని మ్యాచ్ గా మార‌టం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని స్మిత్ అన్నారు.