Suriya : మరణించిన అభిమాని కుటుంబానికి అండగా హీరో సూర్య

తాజాగా సూర్య అభిమాని ఒకరు యాక్సిడెంట్ లో మృతి చెందగా ఆ కుటుంబ సభ్యులని పరామర్శించి అండగా ఉంటానని తెలిపారు. తమిళనాడు నామక్కల్‌ జిల్లా....................

Suriya : మరణించిన అభిమాని కుటుంబానికి అండగా హీరో సూర్య

Suriya

Suriya :  తమిళ్ స్టార్ హీరో సూర్య మంచి నటుడే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని కూడా చాలా సార్లు తెలియచేశాడు. తన భార్య జ్యోతికతో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సూర్య. కరోనా సమయంలోను పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక హీరో సూర్యకి తన అభిమానులను మంచిగా చూసుకుంటారు. వారి కోసం ఏం చేయడానికి అయినా ముందు వరుసలో ఉంటారు సూర్య.

తాజాగా సూర్య అభిమాని ఒకరు యాక్సిడెంట్ లో మృతి చెందగా ఆ కుటుంబ సభ్యులని పరామర్శించి అండగా ఉంటానని తెలిపారు. తమిళనాడు నామక్కల్‌ జిల్లా సూర్య అభిమాన సంఘం కార్యదర్శి జగదీశన్‌ ఇటీవల బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. దీంతో సూర్య నామక్కల్‌లోని ఆ అభిమాని ఇంటికి వెళ్లి అతని భార్య, పిల్లల్ని పరామర్శించారు.

Koffee with Karan : బాలీవుడ్ టాప్ షోలో విజయ్ దేవరకొండ

ఆ అభిమాని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపి, ఆ అభిమాని రెండున్నరేళ్ల కూతురుకి చదువుకి కావాల్సినవి అన్ని సమకూరుస్తాను హామీ ఇచ్చారు సూర్య. దీంతో సూర్య మంచితనంపై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు.