Ashok Galla : ‘హీరో’గా మహేష్ మేనల్లుడు..

‘హీరో’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు అశోక్ గల్లా..

Ashok Galla : ‘హీరో’గా మహేష్ మేనల్లుడు..

Hero Telugu Movie Title Teaser

Ashok Galla: సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ మూవీని సూపర్‌స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణ కుమారి సమర్పణలో, అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది..

సూపర్‌స్టార్ మహేష్ బాబు బుధవారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ఫిలింకి ‘హీరో’ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరోగా పరిచయమవుతున్న తన మేనల్లుడు అశోక్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మహేష్.

‘హీరో’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు అశోక్ గల్లా.. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్, బుల్లెట్ మ‌రియు ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. అశోక్ కౌబాయ్‌గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో ‘హీరో’ సినిమా టైటిల్ టీజర్ ప్రారంభమైంది.  తాత, మేనమామలా తను కూడా జేమ్స్ బాండ్ గెటప్‌లో కనిపించి అభిమానులను అలరించాడు. అలాగే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ మేజర్ హైలైట్‌గా నిలవనుంద‌ని తెలుస్తోంది. వెంట‌నే ఈ యంగ్ హీరో జోక‌ర్ గెట‌ప్‌లో క‌నిపించి అందర్నీ ఆశ్య‌ర్య‌పరిచారు.

అలాగే అశోక్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే లవ్ స్టోరీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. టైటిల్ టీజ‌ర్‌ని బ‌ట్టి ‘హీరో’ సినిమాలో కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక జోక‌ర్‌ లుక్‌లో అశోక్ గ‌ల్లా క‌న్నింగ్ స్మైల్ టీజ‌ర్‌కే హైలెట్ అని చెప్పొచ్చు.

ఒక నిమిషం నిడివిగ‌ల టైటిల్ టీజ‌ర్‌తో హీరో అశోక్ తన టాలెంట్ చూపించే ప్రయత్నంలో విజయం సాధించారు. అలాగే శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ స్టైల్‌కి మంచి ప్ర‌శంస‌లు దక్కుతున్నాయి. ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కష్టం టైటిల్ టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ కూడా క్లాసీగా ఉంది. మంచి నిర్మాణ విలువలు, కెమెరామెన్ రిచర్డ్‌ ప్రసాద్‌ అద్భుతమైన పనితనం, జిబ్రాన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఈ టీజర్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ‘హీరో’ సినిమా టైటిల్ టీజర్ ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు పెంచేసింది.

జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య కీలక పాత్రధారులు. చంద్రశేఖర్ రావిపాటి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హీరో’ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.