Lady Oriented Movies : లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యూ కడుతున్న హీరోయిన్స్..

 మేల్ డామినేటెడ్ మూవీ ఇండస్ట్రీ లో మేమున్నామని ప్రూవ్ చేస్తున్నారు పలువురు హీరోయిన్లు. ఎన్నాళ్లని హీరో పక్కన 4 సీన్లుచేసే సినిమాలు చేస్తాం..? సొంతగా హీరోయిజాన్ని చూపిద్దాం, సోలోగా ఇమేజ్ సంపాదించుకుందామని ఫిక్సయ్యారు హీరోయిన్లు. అందుకే.............

Lady Oriented Movies :  లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యూ కడుతున్న హీరోయిన్స్..

Heroines Showing Interest lady oriented movies

Lady Oriented Movies :  మేల్ డామినేటెడ్ మూవీ ఇండస్ట్రీ లో మేమున్నామని ప్రూవ్ చేస్తున్నారు పలువురు హీరోయిన్లు. ఎన్నాళ్లని హీరో పక్కన 4 సీన్లుచేసే సినిమాలు చేస్తాం..? సొంతగా హీరోయిజాన్ని చూపిద్దాం, సోలోగా ఇమేజ్ సంపాదించుకుందామని ఫిక్సయ్యారు హీరోయిన్లు. అందుకే గ్లామర్ ని పక్కన పెట్టి ఇంట్రస్టింగ్ మూవీస్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

హీరో పక్కన నాలుగు సీన్లు, 2 డ్యూయెట్లు అంతే హీరోయిన్ కి పెద్దగా యాక్టింగ్ చెయ్యాల్సిన అవసరం కానీ, అవకాశం కానీ ఇవ్వడం లేదు మన మేకర్స్. అందుకే హీరోయిన్లు గ్లామర్ పక్కన పెట్టి యాక్షన్ సత్తా చూపించబోతున్నారు. ఇంట్రస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మొన్నీమధ్య సమంత యశోద తో ఆడియన్స్ ని ఇలాగే ఎంగేజ్ చేసింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన యశోద మంచి హిట్ అందుకుంది. సరోగసీ లాంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ ని సీరియస్ గా డీల్ చేసి సక్సెస్ సంపాదించింది సమంత.

ఎప్పుడూ కమర్షియల్ సబ్జెక్ట్స్ మీద కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మీద ఫోకస్ చేసే నిత్యామీనన్ వండర్ విమెన్ అనే క్రేజీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ప్రెగ్నెన్సీ టైమ్ లో ఆడవాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయ్..? వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది..? అన్న ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వండర్ విమెన్ లో నిత్యామీనన్ ప్రెగ్నెంట్ విమెన్ గా నటించి మెప్పించింది.

ఈ మధ్య వరసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న నయనతార అటు చిరంజీవి, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. నెట్రికన్ లాంటి సాలిడ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నయనతార లేటెస్ట్ గా కనెక్ట్ అనే మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ హార్రర్ లవర్స్ కి ఫీస్ట్ ఇస్తోంది.

ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు దాటినా ఇంకా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న త్రిష పొన్నియిన్ సెల్వన్ తో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఈ సినిమా కంటే ముందే విమెన్ సెంట్రిక్ ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తున్న త్రిష.. ద రోడ్ అనే మర్డర్ థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తోంది. వశీగరన్ అనేకొత్త డైరెక్టర్ తో త్రిష చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే హైప్ క్రియేట్ చేసింది. బృంద అనే వెబ్ సిరీస్ కూడా మెయిన్ లీడ్ లో చేస్తుంది త్రిష.

సినిమా కోసం ఎంత దూరమైనా, ఎంత సాహసమైనా చేసే టాలెంటెడ్ హీరోయిన్ అమలాపాల్. ఈ సారి కూడా మరో క్రేజీ స్టోరీతో రాబోతోంది. అదో అందపరవై పోల అనే ఫారెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ‘ఆమె’ లాంటి డేరింగ్ సబ్జెక్ట్ తో వచ్చిన అమలాపాల్ సినిమాలపై క్రేజ్ క్రియేట్ అయ్యిది. అందుకే తన అప్ కమింగ్ మూవీ మీద కూడా ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది.

Mukhachitram : విశ్వక్‌సేన్ ముఖ్యపాత్రలో.. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్.. ‘ముఖచిత్రం’ ట్రైలర్ రిలీజ్..

సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా హీరోయిన్లు గ్లామర్ ని పక్కన పెట్టి ఇంట్రస్టింగ్ కంటెంట్ తో వస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్స్ అయిన హీరోయిన్లు ఇప్పుడు సాలిడ్ సినిమాలతో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా అన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు కంగనా బాటలో తాప్సీ కూడా చేరాలనుకుంటుంది. కమర్షియల్ సినిమాల్ని పక్కన పెట్టి వరసగా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న తాప్సీ లేటెస్ట్ గా మరో ఇంట్రస్టింగ్ మూవీ అనౌన్స్ చేసింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తాప్సీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న బ్లర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక శ్రీదేవి కూతురు జాన్వీ కమర్షియల్ సినిమాలకి స్కోప్ ఉన్నా అంటూ వెళ్లకుండా వరుసగా కంటెంట్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. ఇటీవలే మిలి అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది.