Heros : చాలా గ్యాప్ తర్వాత హిట్స్ కొట్టిన హీరోలు..

కొన్ని ఫ్లాప్స్ తర్వాత హిట్ వస్తే ఏ హీరోకైనా సెలబ్రేషన్ కిందే లెక్క. అంతకు ముందు డిజాస్టర్స్ తో వచ్చిన టెన్షన్ అంతా ఒక్క హిట్ తో మటుమాయమైపోతుంది. కొందరు హీరోలు ఇలా కొంత గ్యాప్ తర్వాత రీసెంట్ గా సక్సెస్ కొట్టి.............

Heros : చాలా గ్యాప్ తర్వాత హిట్స్ కొట్టిన హీరోలు..

Heros comback after a long time

Heros :  కొన్ని ఫ్లాప్స్ తర్వాత హిట్ వస్తే ఏ హీరోకైనా సెలబ్రేషన్ కిందే లెక్క. అంతకు ముందు డిజాస్టర్స్ తో వచ్చిన టెన్షన్ అంతా ఒక్క హిట్ తో మటుమాయమైపోతుంది. కొందరు హీరోలు ఇలా కొంత గ్యాప్ తర్వాత రీసెంట్ గా సక్సెస్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఫెయిల్యూర్ ఎంతటి పెద్ద హీరోనైనా టెన్షన్ పెడుతుంది. పది హిట్స్ తర్వాత ఒక్క ఫ్లాప్ పడినా అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. అందులోనూ పరాజయాల సంఖ్య పెరిగితే అతడి కెరీర్ ఫినీష్ అని ఇక సినిమాలు వేస్టని రకరకాలుగా కామెంట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా కొంత గ్యాప్ తర్వాత హిట్స్ అందుకుని ఫ్లాప్స్ కు చెక్ పెట్టిన హీరోలు కొందరు ఇప్పుడు రిలాక్స్ గా ఫీలవుతున్నారు.

లిస్ట్ లో ముందుగా అల్లు శిరీష్ ను చెప్పుకోవాలి. రీసెంట్ గా ఈ హీరో ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో హిట్టు అందుకున్నాడు. రాకేశ్ శశి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చి యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. నిజానికి శిరీష్ కెరీర్ లో హిట్ అని చెప్పుకునే సినిమాలు రెండే. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు. గౌరవం మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే ఫెయిల్ అయ్యాడు. దీనికి ముందు ఒక్కక్షణం, ఏబీసీడీ సినిమాలు రెండూ డిజాస్టర్ అయ్యాయి. మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు అల్లు శిరీష్. మరి ఈ హిట్ ని ఇలానే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ తో మంచి హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చిరు ఎర్లియర్ మూవీస్ ‘సైరా నరసింహారెడ్డి, ఆచార్య’ మూవీస్ వరుసగా ఫ్లాప్స్ అవడంతో ‘గాడ్ ఫాదర్’ మూవీ సక్సెస్ కీలకమైంది. సినిమా రిజల్ట్ తో ఇప్పుడు చిరు రిలాక్స్ అవుతున్నారు. ఎట్టకేలకు హిట్టొచ్చినందుకు ఫ్యాన్స్ కూడా హ్యాపీ మోడ్ లో ఉన్నారు. మళ్ళీ పాత బాస్ ని గుర్తు చేశారని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

 

యంగ్ హీరో శర్వానంద్ చివరగా ‘మహానుభావుడు’ తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన సినిమాలన్నీ ఘోరంగా ఫెయిల్ అవడంతో శర్వా డిఫెన్స్ లో పడిపోయాడు. ఎలాగైనా హిట్ అందుకొని తిరిగి ఫామ్ లోకి రావాల్సిన పరిస్థితిని ఫేస్ చేశాడు. అయితే అతడు పడ్డ టెన్షన్ కు చెక్ పెడుతూ లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ మంచి సక్సెస్ సాధించింది. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విజయం శర్వానంద్ కు మంచి బూస్టప్ నిచ్చింది.

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్స్ తక్కువ. ప్లాప్స్ ఎక్కువ. అతడు గట్టిగా హిట్స్ సాధించిన సినిమాల్ని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ‘అతడొక్కడే, పటాస్’ లాంటి సినిమాలు తప్ప ఆరెంజ్ లో విజయం సాధించిన సినిమాలు లేవు. ఇలాంటి టైమ్ అతడు నటించిన ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ హిట్టై అతడి టెన్షన్ కు చెక్ పెట్టింది. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

Yash : సౌత్ సినిమాలు చూసి ఎగతాళి చేసేవాళ్ళు.. రాజమౌళి బాహుబలి తర్వాతే.. యష్ సంచలన వ్యాఖ్యలు..

కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలు బాగున్నా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. దీంతో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో తర్వాత ప్రయత్నంగా ‘కార్తికేయ 2’ తో వచ్చాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో సైతం దుమ్మురేపేసింది. ఇంతకు ముందు సూపర్ హిట్టైన కార్తికేయ సినిమాకిది సీక్వెల్. శ్రీకృష్ణుడి తత్వంపై ఇంట్రెస్టింగ్ స్ర్కీన్ ప్లేతో ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతినిచ్చాడు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు నిఖిల్.