Heros : కమల్‌హాసన్ నుంచి సంపూర్ణేష్ బాబు వరకు నగ్నంగా నటించిన హీరోలు వీళ్ళే

. ఎలాంటి పాత్రను చేయడానికైనా వెనుకాడరు. ఆఖరికి నగ్నంగా నటించడానికి కూడా వెనకాడరు కొంతమంది ఆర్టిస్టులు. సినిమా అంటే వాళ్లకి అంత పిచ్చి. ఇలా సినిమాల్లో కొంతమంది హీరోలు కూడా నగ్నంగా..

Heros : కమల్‌హాసన్ నుంచి సంపూర్ణేష్ బాబు వరకు నగ్నంగా నటించిన హీరోలు వీళ్ళే

Heros

 

Heros :  సినిమా కోసం ఎంత దూరం వెళ్లడానికైనా, ఎలాంటి రిస్క్ చేయడానికైనా కొంతమంది ఆర్టిస్టులు రెడీగా ఉంటారు. వాళ్ళు ఏ పాత్ర అయినా అవలీలగా చేస్తారు. ఎలాంటి పాత్రను చేయడానికైనా వెనుకాడరు. ఆఖరికి నగ్నంగా నటించడానికి కూడా వెనకాడరు కొంతమంది ఆర్టిస్టులు. సినిమా అంటే వాళ్లకి అంత పిచ్చి. ఇలా సినిమాల్లో కొంతమంది హీరోలు కూడా నగ్నంగా నటించారు. ఆ హీరోలు ఎవరో తెలుసుకోండి.

Bigg Boss 5 : కూతురు వియా రాకతో ఎమోషనల్ అయిన రవి.. అదిరిపోయిన ప్రోమో

అయితే సినిమాల్లో నగ్నంగా మగవాళ్ళైనా సరే సెన్సార్ ఒప్పుకోదు కాబట్టి మగవారి ప్రైవేట్ పార్ట్ వరకు కవర్ చేసేలా లేదా బ్లర్ చేసి చూపిస్తారు. కమల్ హాసన్ అప్పుడెప్పడో వచ్చిన ‘పదహారేళ్ళ వయసు’ సినిమాలోనే నగ్నంగా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ‘అభయ్’ అనే సినిమాలో మరోసారి నగ్నంగా కనిపించారు.

‘బాయ్స్’ సినిమాలో హీరో సిద్దార్థ్ కూడా నగ్నంగా కనిపిస్తాడు.

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగులో ‘ఈగ’ సినిమాలో విలన్ గా చేశాడు. ఈ సినిమాలో సుదీప్ ఈగతో పోరాడే సమయంలో నగ్నంగా మారుతాడు.

క్లాస్ హీరో శ్రీకాంత్ ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలో ఎంత మాస్ గా కనపడ్డారో మన అందరికి తెలుసు. ఆ సినిమాలో శ్రీకాంత్ నగ్నంగా రోడ్ మీద నడిచి వస్తాడు. అయితే ఈ సీన్ ని సెట్ లో కాకుండా నిజంగా జనాల మధ్య తీయడం గమనార్హం. నిజంగా జనాల మధ్య ఇలా నడవాలంటే సినిమా అంటే ఎంతో పిచ్చి ఉంటె తప్ప శ్రీకాంత్ ఆలా చేయడు. ఈ సినిమాకి చాలా అవార్డులు, రివార్డులు వచ్చాయి.

ఇక ప్రకాష్ రాజ్ కూడా ‘ఒంగోలు గిత్త’ సినిమాలో నగ్నంగా కనిపిస్తాడు. అయితే ఇందులో ఈ సీన్ ని కామెడీ కోసం వాడుకున్నారు.

ఇటీవల అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా కోసం నగ్నంగా కనపడ్డారు. ఎంతో ఇంటెన్సిటీ ఉన్న సీన్ ఇది. ఇందులో నరేష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

తాజగా కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్’ సినిమా కోసం నగ్నంగా మారారు. ఈ సినిమాలో కామెడీ కోసం సంపూర్ణేష్ బాబు ఇలా కనపడటానికి రెడీ అయ్యాడు.

Samantha : బైసెక్సువల్ లేడీగా సమంత.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ..

బాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలు నగ్నంగా కనపడ్డారు. ‘పీకే’ సినిమాలో అమిర్ ఖాన్ నగ్నంగా కనపడతాడు. తెలుగులో కూడా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సినిమాల్లో సీన్ ని బట్టి నగ్నంగా, అర్ధనగ్నంగా కనపడ్డారు. సినిమాపై ఎంతో ప్రేమ ఉండి, ఇలాంటి సీన్స్ చేయడానికి ధైర్యం ఉంటే తప్ప హీరోలు నగ్నంగా కనపడటానికి ముందుకు రారు.