Blood Pressure : అధిక రక్తపోటు….సైలెంట్ కిల్లర్!..

అధిక రక్తపోటు కారణంగా పైకి కనబడని మార్పులు కొన్ని శరీరంలో చోటు చేసుకుంటాయి. లైంగిక పటుత్వం తగ్గిపోవడం. రక్తనాళాలు కుంచించుకు పోవడం, గుండెపోటు, చూపు తగ్గిపోవడం.

Blood Pressure : అధిక రక్తపోటు….సైలెంట్ కిల్లర్!..

Hyper Tension

Blood Pressure : ఇటీవలి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళే వారిలో వైద్యుల సూచనతో చేస్తున్న రక్తపరీక్షల్లో అధిక రక్తపోటు సమస్య వెలుగు చూస్తుంది. అప్పటికే వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పటికీ వారు సమస్యను గుర్తించలేని పరిస్ధితి నెలకొంటుంది. అందుకే అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తే వరకూ అధిక రక్తపోటు వచ్చిందన్న విషయం కూడా తెలియటంలేదు. రక్తపోటు వస్తే దానితో పాటు కొన్ని లక్షణాలు కనబడతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే రక్తపోటు లక్షణాలను మనం గుర్తించే లోపే పరిస్ధితి చేయిదాటిపోయే పరిస్ధితులు ప్రస్తుతం ఎదురవుతున్నాయి.

రక్తపోటు ఉంటే తలనొప్పి, చమట్లు పోయడం, తల తిరగడం, ముఖం ఎర్రబడడం, ముక్కు వెంట రక్తం కారడం వంటి లక్షణాలు కనబడతాయని చాలామంది భావిస్తారు. రక్తపోటు 180/120 కన్నా ఎక్కువ స్థాయికి పెరిగినపుడు కొన్ని లక్షణాలు కనబడతాయి. దీనిని తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా వైద్యులు పరిగణిస్తారు. తీవ్రమైన తలనొప్పి, ముక్కు వెంట రక్తం కారడం, ఛాతి నొప్పి, వెన్ను నొప్పి, మానసిక ఆందోళన, ఊపిరి ఆడక పోవడం వంటి లక్షణాలు ఈ దశలో కనిపిస్తాయి.

అధిక రక్తపోటు కారణంగా ఎక్కవ మంది గుండె జబ్బుకు గురువతున్నారు. పక్షవాతం బారిన పడుతున్నారు. కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. బైయిన్‌ స్టోక్‌ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్‌ స్టోక్‌ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడి కిడ్నీ దెబ్బతిని పనిచేయకుండా పోయే ప్రమాదముంది. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి చివరకు అనేక సమస్యలు ఉత్పన్నమై ప్రాణాపాయ స్ధితిలోకి వెళ్ళాల్సివస్తుంది.

అధిక రక్తపోటు కారణంగా పైకి కనబడని మార్పులు కొన్ని శరీరంలో చోటు చేసుకుంటాయి. లైంగిక పటుత్వం తగ్గిపోవడం. రక్తనాళాలు కుంచించుకు పోవడం, గుండెపోటు, చూపు తగ్గిపోవడం. మూత్రపిండాల వ్యాధి, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు గర్భం వచ్చిన సమయంలో అధిక రక్తపోటు కనిపిస్తుంది. ఆసమయంలో తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు కావడం, పొట్టలో నొప్పి, బరువు పెరగడం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ రక్తపోటుకు వైద్యుడి సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో తల్లికి, శిశువుకూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అధిక రక్తపోటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;

ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30నుంచి 45 నిమిషాలు నడవాలి. తినే ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. బయటీ ఆహార పదార్ధాలను తినకుండా ఇంట్లో ఉప్పు తక్కువ వండే ఆహారాలను తీసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికాకుండా ఉండాలి. బరువు పెరగకుండా చూనుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఉండేలా జూగ్రత్త వహించాలి. కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడాలి.