Bandhi Sunjay: బండి సంజయ్‌కు ఊరట.. పాదయాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సంజయ్ బైంసా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.

Bandhi Sunjay: బండి సంజయ్‌కు ఊరట.. పాదయాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..

Bandhi Sunjay

Bandhi Sunjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని షరతులు విధించింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనికితోడు యాత్ర ప్రారంభోత్సవ సభ బైంసాకు 3 కి.మీ దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు హైకోర్టులు స్పష్టం చేసింది. హైకోర్టు అనుమతితో సంజయ్ బైంసా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తయింది. నేటి నుంచి 5వ విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సంజయ్ పాదయాత్రను నిర్వహించాల్సి ఉండగా, పోలీసులు యాత్రకు అనుమతి ఇవ్వలేదు. .

Bandi Sanjay: బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిర్మల్ జిల్లా భైంసా నుంచి 5వ విడత పాదయాత్రను మొదలు పెట్టేందుకు వెళ్తున్న బండి సంజయ్ ను ఆదివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు సంజయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సంజయ్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సంజయ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపు వాహనంలోనే ఉంచారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో పోలీసులు వారిని పక్కకు నెట్టేసి.. సంజయ్ వాహనంలో కరీంనగర్ లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు.

Bandi Sanjay: భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర.. అనుమతి నిరాకరించిన పోలీసులు

మరోవైపు సంజయ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో బీజేపీ నాయకులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి పాదయాత్ర వెళ్లదని రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. రూట్ మ్యాప్ వివరాలు కోర్టుకు సమర్పించారు. బైంసా వై జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందని చెప్పారు. బైంసా టౌన్‌లోకి పాదయాత్ర ప్రవేశించదని స్పష్టం చేశారు. బైంసా టౌన్‌లోకి ప్రవేశించనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన ప్రాంతం అని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. శాంతి భద్రలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఏజీ వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సంజయ్ పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.