CM KCR: కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.

CM KCR: కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

Kcr

CM KCR: సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.

Viral News: మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న వృద్ధుడు.. వైద్యులు ఏం చేశారంటే..

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని NBT నగర్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపు  చేసింది ప్రభుత్వం. కార్యాలయం నిర్మాణం కోసం 4,935 గజాలు కేటాయించారు. అయితే కోట్లు విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశాడు. హైదరాబాద్ సహా 33 జలాల్లో ఇదే విధంగా భూముల కేటాయింపు జరిగిందని కోర్టుకు పిటీషనర్ తెలిపాడు.

Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..

పిటిషన్ తరఫు వాదనలు విన్న ప్రధాన ధర్మసనం రాష్ట్ర సీఎస్, CCLA కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, హైదరాబాద్ కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీలకు కోర్టు నోటీసులు అందించింది. అంతేకాక నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.