వరంగల్ లో హిజ్రా హత్య..లైంగిక వేధింపులే కారణమా?

10TV Telugu News

వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఓ కారు డ్రైవరే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు  కారు డ్రైవర్ సురేష్ ను లైంగికంగా వేధించటం వల్లనే సురేష్ వేధింపులు భరించలేక హిజ్రాను కత్తితో పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తితో పొడవటంతో తీవ్రంగా గాయాలైన హిజ్రా మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు.

అనంతరం హిజ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ పై హిజ్రా లైంగిక వేధింపులకు గురిచేయటం వల్లనే హత్య చేశాడా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు  విచారణను ముమ్మరం చేశారు.  

Read Here>> భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి