Himachal Pradesh Elections: భారీ భద్రత నడుమ కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్.. ఓటర్లకు కీలక సూచన చేసిన మోదీ..

హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటిసారి బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్ మధ్య త్రిముఖపోరు నెలకొంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.

Himachal Pradesh Elections: భారీ భద్రత నడుమ కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్.. ఓటర్లకు కీలక సూచన చేసిన మోదీ..

Himachal Pradesh Election

Himachal Pradesh Elections: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఎన్నికల బరిలో 412 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థులు.

Himachal Pradeh election

Himachal Pradeh election

హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటిసారి బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్ మధ్య త్రిముఖపోరు నెలకొంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐఎం నుంచి 11 మంది, సీపీఐ ఒక్కరు, బీఎస్పీ నుంచి 53 మంది, ఆర్డీపీ నుంచి 29 మంది అభ్యర్థులు అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచారు. సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత జై రామ్ ఠాకూర్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి చేత్రమ్ ఠాకూర్, ఆప్ నుంచి గీతా నంద్ ఠాకూర్ లు బరిలో నిలిచారు. హరోలి స్థానం నుంచి రామ్‌కుమార్ (బీజేపీ) ముఖేష్ అగ్నిహోత్రి (కాంగ్రెస్)రవీందర్ పాల్ సింగ్ మాన్ (ఆప్) బరిలో నిలిచారు. అదేవిధంగా సిమ్లా రూరల్ నుంచి రవి మెహతా (బీజేపీ), విక్రమాదిత్య సింగ్ (కాంగ్రెస్), వర్సెస్ ప్రేమ్ ఠాకూర్ (ఆప్) అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మండి నియోజకవర్గం నుంచి అనిల్ శర్మ (బిజెపి), చంపా ఠాకూర్ (కాంగ్రెస్), శ్యామ్ లాల్ (ఆప్) పోటీ పడుతున్నారు. హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి నరీందర్ ఠాకూర్ (బిజెపి), పుష్పేంద్ర వర్మ (కాంగ్రెస్), సుశీల్ కుమార్ సురోచ్ (ఆప్)లు పోటీ పడుతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలుపొందిన బిజెపి, 21 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్య పండుగలో దేవభూమి ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని కోరారు. తొలిసారిగా ఓటువేసే రాష్ట్ర యువతకి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 30 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. 67 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, 11,500 మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. 7881 పోలింగ్ స్టేషన్లలో 981 కీలకమైనవి, 901 సున్నితమైనవిగా పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.