Hanuman in Goa: అక్కడా కాదు ఇక్కడా కాదు, హనుమంతుడి జన్మస్థలం గోవా: గోవా బీజేపీ నేత కుమారుడు

హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు

Hanuman in Goa: అక్కడా కాదు ఇక్కడా కాదు, హనుమంతుడి జన్మస్థలం గోవా: గోవా బీజేపీ నేత కుమారుడు

Hanuma

Hanuman in Goa: హనుమంతుడి జన్మస్థలం గురించి దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. గత కొంతకాలంగా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీస్తున్న ఈ విషయంపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి జన్మస్థలం..కర్ణాటకలోని కిష్కింధ (హంపీ)గా మహంత్ గోవింద్ దాస్ స్వామి వాదిస్తుంటే..ఏపీలోని తిరుమల కొండల్లో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ తిరుమల ఆస్థాన పండితులు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మహారాష్ట్రకు చెందిన కొందరు పండితులు..హనుమంతుడి జన్మస్థలం పై మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. హనుమంతుడు అటు కిష్కిందలోనూ.. ఇటు అంజనాద్రి(తిరుమల)లోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని కొందరు పండితులు పేర్కొన్నారు.

Other Stories: Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం

ఇక గత కొన్ని రోజులుగా ఆసక్తిగా మారిన ఈ విషయంపై ఒక స్పష్టత తెచ్చేందుకు శ్రీ మండలాచార్య మహంత్ పీఠాదిపది స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ ఆధ్వర్యంలో మే31న నాసిక్ లో ‘ధర్మ సంసద్‌ను’ ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణాన్ని చేతబట్టి ధర్మ సంసద్ కు చేరుకున్న మహంత్ గోవింద్ దాస్ స్వామి తన వాదనని బలంగా వినిపించగా..ప్రతివాదులు తిరగబడ్డారు. దీంతో ఆంజనేయుడి జన్మస్థలంపై స్పష్టత రాకుండానే ధర్మ సంసద్ రసాబాసకు దారి తీసింది. ఇదిలాఉంటే అసలు హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు.

Other Stories: Hanuman Jayanti : ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే హనుమాన్ లాంగూల స్తోత్రమ్

గోవా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రమాకాంత్ ఖలాప్ కుమారుడే ఈ శ్రీనివాస్ ఖలాప్. గోవాలోని అంజేదీవ ద్వీపమే హనుమంతుడి జన్మస్థలమని, వాల్మీకి రామాయణం ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తుందని శ్రీనివాస్ ఖలాప్ శుక్రవారం మీడియాతో అన్నారు. “హనుమంతుని తల్లి అంజనీ దేవి సముద్రంలోని ఒక ద్వీపంలో తపస్సు చేస్తుందని వాల్మీకి రామాయణంలో వ్రాయబడింది. వాయుదేవుని వరం కారణంగా హనుమంతుడు జన్మించాడు. అప్పటి నుంచి ఆ ద్వీపం పేరు అంజనీ ద్వీప్ గా ప్రసిద్ధి చెందింది, అదే ప్రస్తుతం గోవాలోని అంజేదీవ ద్వీపం. ఇప్పుడు ఈ ద్వీపం కార్వార్ సమీపంలో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ద్వీపం గోవాలో భాగం. కాబట్టి మనం హనుమంతుడు గోవాలో జన్మించాడని చెప్పగలం”, అని ఖలాప్ అన్నారు.