రాష్ట్రంలో మద్యం హోం డెలివరీ.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 01:02 PM IST
రాష్ట్రంలో మద్యం హోం డెలివరీ.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం కొన్నింటికి సడలింపు ఇచ్చింది. వీటిలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనలు ఉల్లంఘిస్తూ మందు బాబులు అత్యత్సూహం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

నిబంధనల మధ్య మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు  మద్యం విక్రయించాలి. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు డోర్ డోర్ డెలివీరికి అనుమతించారు. ఈ మేరకు బుధవారం ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. 

నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. చాలా ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదన్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున లిక్కర్ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నామని వివరించారు. 

చత్తీస్ ఘడ్ లో గ్రీన్ జోన్లలో ఆన్ లైన్ ద్వారా మద్యం పంపిణీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. చత్తీస్ ఘడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.. అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వొచ్చు.