Martina Navratilova: మోడీపై అమిత్ షా ప్రశంసలు..అదో జోక్ అంటూ టెన్నిజ్ లెజెండ్ సెటైర్

ప్రధాని మోడీ నియంత కాదు ఓ ప్రజాస్వామ్య నేత అంటూ అమిత్ షా ప్రశంసించారు. దీనిపై ప్రముఖ టెన్నిస్ లెజెండ్ మార్టినానవ్రతిలోవా ‘షా మోడీని ప్రశంసించటంలో ఓ జోక్’ అని అన్నారు.

Martina Navratilova: మోడీపై అమిత్ షా ప్రశంసలు..అదో జోక్ అంటూ టెన్నిజ్ లెజెండ్ సెటైర్

Amit Shah's Praise For Modi A Joke 

Amit Shah’s praise for Modi a joke  : మార్టినా న‌వ్ర‌తిలోవా. ప్రముఖ టెన్నిస్ లెజెండ‌రీ ప్లేయ‌ర్. 20 వ శతాబ్దపు ఉత్తమ క్రీడాకారిణిగా పేరు గాంచిన మార్టినా న‌వ్ర‌తిలోవా ప్రధాని మోడీపై సెటైరిగ్ గా మాట్లాడారు. త‌న ట్విట్ట‌ర్‌ వేదికగా న‌వ్ర‌తిలోవా కాస్త ఘాటుగానే కామెంట్ చేసారు. ప్రధాని మోడీ నియంత కాదు..ఓ ప్ర‌జాస్వామ నేత అని ఇటీవ‌ల శాన్సాడ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ ప్రశంసపై నవ్రతిలోవా స్పందిస్తు..సెటైరిక్ గా మాట్లాడారు. అమిత్ షా మోడీకి ప్రశంసించటం ఓ జోక్ అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

మోడీ ఓ నిరంకుశ నాయకుడు అనే వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై షా ఖండించాడు. ప్రధాని మోడీ తన హోదాను ఏమాత్రం పట్టించుకోరని..హోదాతో సంబంధం లేకుండా ఎవరైనా ఇచ్చే అన్ని విలువైన సలహాలకు ప్రాముఖ్యత ఇస్తారని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాల కోసం రాజకీయ ప్రమాదాలను ఎదుర్కోవడంలో మోదీ ఏమాత్రం వెనుకాడరని, కొన్ని సార్లు దేశ సంక్షేమం కోసం కాస్త కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని అటువంటి నాయకుడు భారత్ కు ఎన్నిక కావటం అదృష్టంటూ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read more : Coal Shortage : రంగంలోకి అమిత్ షా..బొగ్గు ,విద్యుత్ శాఖ మంత్రులతో భేటీ

నేను మోడీని ఆయన పనితీరును..రెండింటినీ దగ్గరగా చూశాను. అతనిలాంటి సహనశీలుడు…ఎవరు ఎటువంటి సలహాలు చెప్పినా ఓపికగా వినేవారిని నేను ఎన్నడూ చూడలేదని అన్నారు. సమస్య ఏమైనా..చెప్పేవారు ఎవరైనాసరే..ఆయన చాలా ఓపికగా అందరి మాటలను వింటారని అన్నారు. అన్నింటిని ఆలోచించి సరైన సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. చిన్న సమయం దొరికినా.. అధికారి నుంచి కార్మికుడి వరకు ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా వింటారని వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఓపికగా నిర్ణయాలు తీసుకుంటారని అమిత్ షా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

షా ఇలా ప్రధాని మోడీపై వరుసపెట్టి ప్రశంసల వర్షం కురిపించిన క్రమంలో టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా స్పందిస్తు ‘అమిత్ షా మోదీని ప్రశంసించటం ఓ జోక్’ అంటూ సెటైర్లు వేశారు.కాగా గతంలో కూడా మార్టినా నవ్రతిలోవా భారత ప్రధాని మోడీ, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ లపై పలు విమర్శలు చేశారు. ట్వీట్‌లో..మోదీ,ట్రంప్ వీలైనంత వరకు వాస్తవాలను బయటకు రాకుండా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని.. విమర్శించారు. 2019 లో, మోడీ మరియు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సత్సంబంధాలను నవరతిలోవా వక్రీకరించారు.

Read more : China Army : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు

కాగా..అమెరికా టెన్నిస్ స్టార్ మార్టినా న‌వ్ర‌తిలోవా మ‌హిళ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్‌గా ఉన్నారు. ఆమె ఖాతాలో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. దీంతో పాటు 31 మ‌హిళ‌ల గ్రాండ్ స్టామ్ టైటిళ్లతో పాటు 10 మిక్స్‌డ్ డ‌బుల్స్ టైటిళ్లు ఉన్నాయి. గ‌తంలోనూ న‌వ్ర‌తిలోవా ప్ర‌ధాని మోడీని విమ‌ర్శించారు. మోదీ, ట్రంప్ విధానాల‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆ ఇద్ద‌రూ నిజాల‌ను అణిచివేస్తార‌ని ఆమె అన్నారు.