Honey : మలబద్దకం, ఛాతి మంటతోపాటు బరువును తగ్గించే తేనె,నిమ్మరసం!

శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోవాలంటే ఒక కప్పు హెర్బల్ టీకి ఒక స్పూను తేనె కలిపి తాగితే డిటాక్సిఫికేషన్ లా పనిచేస్తుంది. రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ కి ఒక స్పూను తేనె కలిపి తాగితే సైనస్ అదుపులో ఉంటుంది.

Honey : మలబద్దకం, ఛాతి మంటతోపాటు బరువును తగ్గించే తేనె,నిమ్మరసం!

Honey

Honey : రోగనిరోధక శక్తి పెంచటంలో తేనె, నిమ్మరసం ఎంతోగానో ఉపయోగపడతాయి. తెనెలో అధిక పోషకాలు ఉంటాయి. హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు కలిగి ఉంది. కాల్షియం, ఐరన్ , సోడియం, ఫాస్పరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతోపాటు, విటమిన్ సి, బి, వంటి విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి. గ్లాసు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె , సంగం చెక్క నిమ్మరసం కలిపి ఉదయం నిద్రలేచిన వెంటనే తాగితే మలబద్దకం, ఛాతి మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

తేనెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మద్యం తాగటం వల్ల వచ్చే హ్యాంగోవర్ నుండి బయటపడేందుకు తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయంలో మద్యాన్ని త్వరగా విడగొడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఒక స్పూను తేనె, అరచెంచా దాల్చిన చెక్క పొడి కలుపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనానికి తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవటం మంచిది.

శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోవాలంటే ఒక కప్పు హెర్బల్ టీకి ఒక స్పూను తేనె కలిపి తాగితే డిటాక్సిఫికేషన్ లా పనిచేస్తుంది. రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ కి ఒక స్పూను తేనె కలిపి తాగితే సైనస్ అదుపులో ఉంటుంది. చర్మం సున్నితంగా ఉండాలన్నా, మృతకణాలు తొలగిపోవాలన్నా తేనెలో పంచదారను కలిపి సున్నితంగా చర్మంపై రుద్దితే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తేనె , గులాబీ నీరు కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయటం ద్వారా మచ్చలను తొలగించుకోవచ్చు