Sunflower Seed Production : రైతులకు ఆశాజనకంగా పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి !

హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడులాగే వుంటాయి.

Sunflower Seed Production : వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచ దేశాలన్నీటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల ఏటా, వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, దిగుమతుల కోసం , ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఇది దేశానికి పెనుభారంగా మారింది . ఆయిల్ పామ్, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ వంటి నూనెలు , ప్రధానంగా ఈ దిగుమతుల్లో వున్నాయి.

ఏటా దిగుమతులు పెరగటమేకానీ తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు, ప్రభుత్వాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నూనె పంటల్లో, ఏడాది పొడవునా, అన్నికాలాల్లో సాగుచేయదగ్గ పంట ప్రొద్దుతిరుగుడు. అందుకే చాలా మంది ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.

READ ALSO : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో తెగుళ్ళు…యాజమాన్యం

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి జరుగుతోంది. సారవంతమైన నేలలు, కాలుష్యరహిత వాతావరణం, నీటి వసతి ఆశాజనకంగా వుండటంతో ఈ ప్రాంతాల్లో నాణమైన విత్తనోత్పత్తి జరుగుతోంది.

పలు కంపెనీలు ఈ ప్రాంతంలో విత్తనపు పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహిస్తుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొన్ని విత్తన కంపెనీలు.. విత్తన ఉత్పత్తి కోసం రైతులతో భైబ్యాక్ ఒప్పందం చేసుకొని వారిచేత సాగుచేయిస్తున్నారు.

అయితే ఈ విత్తనోత్పత్తి పొద్దుతిరుగుడు సాగుచేసే గ్రామంలో ఒక కంపెనీకి సంబందించిన విత్తనాలు మాత్రమే నాటాల్సి వుంటుంది. దీనికి సంబందించి రైతులతో ముందస్తు ఒప్పందాలను కంపెనీలు చేసుకుంటాయి.

ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం , నర్సాపురం గ్రామానికి చెందిన రైతు రాప్రోలు మాధవరావు… పుట్ర్యాల, మల్యాల, లక్ష్మిపురం, కలగరు, నర్సాపురం గ్రామాల్లో 125 ఎకరాలు కౌలుకు తీసుకొని పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేస్తున్నారు.

READ ALSO : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకోసం…

హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడులాగే వుంటాయి. ఒకవేళ సాధారణ పొద్దుతిరుగుడు సాగు వున్నట్లయితే దీనికి విత్తన పొద్దుతిరుగుడు మధ్య దూరం కనీసం 2 కిలో మీటర్లు వుండేటట్లుగా జాగ్రత్త వహించాల్సి వుంటుంది.

సాధారణంగా ఎకరానికి మగ విత్తనాలు 300 గ్రాములు, ఆడ విత్తనాలు 1 కిలో 300 గ్రాములు చొప్పున నాటతారు. రైతులు అసలు పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి ఏవిధంగా చేస్తున్నారో వీటిని సాగు చేస్తున్న రైతు మాధవరావు ద్వారా తెలుసుకుందాం. పూర్తి వివరాలకు క్రింది వీడియో పై క్లిక్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు