అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హౌస్‌ఫుల్ 5’

  • Published By: sekhar ,Published On : December 10, 2020 / 05:43 PM IST
అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హౌస్‌ఫుల్ 5’

Housefull 5: బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రెడీ అవుతోంది. ఇంతకుముందెప్పుడూ లేని స్టార్ కాస్ట్‌తో, క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోంది ‘హౌస్ ఫుల్ 5’… ఈ మధ్య బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్ మూవీ రావట్లేదు అనే అపవాదును తొలగిస్తూ సాజిద్ నడియాడ్‌వాలా, అక్షయ్ కుమార్ కలిసి ప్రెస్టీజియస్‌గా ‘హౌస్ ఫుల్ 5’ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకెళ్లే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఎవరో చూద్దాం.


ఒక సినిమా హిట్ అయితే.. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు మేకర్స్. ఈ సీక్వెల్ లిస్ట్‌లో హాట్ హాట్‌గా వస్తున్న సినిమా ‘హౌస్ ఫుల్ 5’ . ప్రేక్షకులను పొట్టలు పగిలిపోయేలా నవ్వించిన హౌస్ ఫుల్ సిరీస్.. మరోసారి ఫుల్లీ లోడెడ్ మస్తీతో.. ఇంకాస్త కామెడీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.



బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా వచ్చిన  ‘హౌస్ ఫుల్ 4’ రూ. 200 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది.. ఈ సారి అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో సీక్వెల్ రెడీ చేస్తున్నారు సాజిద్ నడియాడ్‌వాలా, అక్షయ్ కుమార్. భారీ స్టార్ కాస్ట్‌తో త్వరలోనే సెట్స్ మీద కెళుతున్న ‘హౌస్ ఫుల్ 5’ కి సంబందించి స్టార్ కాస్ట్ రివీల్ చేశారు మేకర్స్ .


అక్షయ్, దీపికా పదుకోన్, కృతిసనన్, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, జాక్విలిన్ ఫెర్నాండెజ్..ఇలా బాలీవుడ్ స్టార్ బ్యాచ్ అందరితో ఫుల్ కామెడీని అందించడానికి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా హిలేరియస్‌గా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్లుగా ఇప్పటి వరకూ వచ్చిన ‘హౌస్ ఫుల్’ సినిమాల బాటలోనే ‘హౌస్ ఫుల్ 5’ కూడా ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది.