ఫేస్‌బుక్ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ ఎలా‌? ఈ ట్రిక్ తెలుసుకోవాల్సిందే!

  • Published By: srihari ,Published On : June 28, 2020 / 12:38 PM IST
ఫేస్‌బుక్ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ ఎలా‌? ఈ ట్రిక్ తెలుసుకోవాల్సిందే!

మీ ఫేస్‌బుక్‌లో వీడియోలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా? ఫేస్‌బుక్‌లో మీకు ఇష్టమైన పోస్టులను చూసినప్పుడు సేవ్ చేస్తుంటారు. ఏదైనా ఫన్నీ వీడియోను చూసి డౌన్ లోడ్ చేయాలనుకుంటారు. మీరు ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు అవసరమైన వీడియోలను సేవ్ చేసుకోవచ్చు. మీరు స్నేహితులతో షేర్ చేయాల్సిన ఫన్నీ వీడియో అయినా మీరు మీ ఫీడ్ నుంచి ఫేస్‌బుక్ వీడియోలను మీ డివైజ్‌కు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ట్రిక్ facebook.comలో మాత్రమే పనిచేస్తుంది. ఫేస్ బుక్ యాప్‌లో మాత్రం పనిచేయదు. ముందుగా మీ బ్రౌజర్‌లోని ఫేస్‌బుక్‌ వెబ్ సైటు ఓపెన్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేయాల్సిన వీడియోను ఎంచుకోండి. వీడియోపై రైట్ సైడ్ క్లిక్ చేయండి. తరువాత, వీడియో URL చూపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.వీడియో URL ఉన్న చిన్న బాక్సు పాప్ అప్ వస్తుంది. లింక్‌ను కాపీ చేయండి. ఆపై కొత్త ట్యాబ్ లేదా విండో అడ్రస్ బాక్సులో Paste చేయండి. అడ్రస్ బార్‌లోని (F6 షార్ట్ కట్) www కు బదులుగా mbasicగా మార్చండి.

మీరు డౌన్ లోడ్ చేసే వీడియో URL https://www.facebook.com/DigitalTrends/videos/593414421380089 ఉంటే… మీరు దీన్ని https://mbasic.facebook.com/DigitalTrends/videos/593414421380089 మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కీబోర్డ్‌లో ఎంటర్ నొక్కండి. వెబ్ అడ్రరస్‌ను మొబైల్ బేసిక్ ఇంటర్ ఫేస్ అడ్రస్‌గా మార్చేస్తుంది. అప్పుడు వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్రాసెస్ మీరు సరిగ్గా చేస్తే.. మీ బ్రౌజర్‌లోని ఫేస్‌బుక్ యాప్ స్క్రీన్ కొద్దిగా ఫన్నీగా కనిపిస్తుంది.

తరువాత, వీడియోపై రైట్ సైడ్ క్లిక్ చేయండి. Menu నుంచి కొత్త Tabలో ఓపెన్ లింక్‌ను ఎంచుకోండి. కొత్త Tabలో వీడియో కనిపిస్తుంది. కేవలం వీడియో మాత్రమే డౌన్ లోడ్ అవుతుంది. వీడియోపై రైట్ సైడ్ క్లిక్ చేసి మెనూ నుంచి వీడియోను Save అనే ఆప్షన్ ఎంచుకోండి. మీ కంప్యూటర్‌లో మీరే ఇతర వీడియో లేదా ఫోటో మాదిరిగానే Save చేయండి. ఇప్పుడు మీరు మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన వీడియో ప్లేయర్‌తో వీడియోను Play చేసుకోవచ్చు.

యాప్ నుంచి Facebook వీడియోను డౌన్ లోడ్ :
మీకు కంప్యూటర్ లేదా.. మీ ఫోన్‌ Facebook యాప్ నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ ఫోన్‌కు థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫేస్‌బుక్ యాప్‌కు అదనపు ఫీచర్లను జోడిస్తుంది. FB యాప్ కోసం ఫ్రెండ్లీని ఉపయోగించవచ్చు. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, మీ ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవ్వమని అడుగుతుంది.

మీరు రెగ్యులర్ అకౌంట్ మాదిరిగానే లాగిన్ అవ్వండి. యాప్ ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేస్తుంది. మీరు ఫేస్‌బుక్ యాప్ ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత, మీరు డౌన్‌లోడ్ చేయాల్సిన వీడియోను ఎంచుకోండి. వీడియో పోస్ట్ దిగువన మీరు షేర్ బటన్ పక్కన కొద్దిగా ఎలియన్ ఐకాన్ కనిపిస్తుంది. ఎలియన్ ఐకాన్ పై Tap చేయండి. ఇప్పుడు మీకో పాప్ అప్ మెనూ కనిపిస్తుంది. వీడియో డౌన్‌లోడ్ చేసి ఆప్షన్‌పై నొక్కండి. వీడియో డౌన్‌లోడ్ చేసి మీ ఫోన్‌లో సేవ్ చేస్తుంది. ఇలా ఫేస్‌బుక్ పోస్టులను సేవ్ చేసి డౌన్ లోడ్ చేసిన వీడియోలను ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు.