DSC-1998: ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారు?: మంత్రి బొత్స‌

డీఎస్సీ-1998లో ఎంపికైన వారి నియామకాల విష‌యంపై ఏపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల దస్త్రంపై ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం సంతకం చేసిన విష‌యం తెలిసిందే.

DSC-1998: ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారు?: మంత్రి బొత్స‌

Botsa

DSC-1998: డీఎస్సీ-1998లో ఎంపికైన వారి నియామకాల విష‌యంపై ఏపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల దస్త్రంపై ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం సంతకం చేసిన విష‌యం తెలిసిందే. చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స దీనిపై స్పందిస్తూ… 1998 డీఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాలు పొందటం హ‌ర్షించ‌తగ్గ విష‌య‌మే కానీ, వారిని చూస్తే త‌నకు భయమేస్తోందని అన్నారు.

Maharashtra: ‘రేపు బ‌ల‌ప‌రీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మాలిక్, దేశ్‌ముఖ్

డీఎస్సీ-1998లో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేమి పాఠాలు చెప్పగలరని ఆయ‌న ప్ర‌శ్నించారు. వారి వయసు పెరిగిపోయింద‌ని, ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతార‌ని ఆయ‌న అన్నారు. ఆయా ఉద్యోగులకు మళ్లీ శిక్ష‌ణ ఇస్తామ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. కాగా, ఇన్నాళ్ళకు తమకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు వస్తుండడంతో 1998 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.